Cucumber Benefits: దోసకాయను ఇలా తినండి.. చాలా ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

దోసకాయలో ఉండే పొటాషియం రక్తపోటుని నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కుకుర్బిటాసిన్ వంటే సమ్మేళనాలు హైబీపిని తగ్గించడంలో సహాయం చేస్తాయి.

Written By: Swathi Chilukuri, Updated On : June 14, 2024 4:50 pm

Cucumber Benefits

Follow us on

Cucumber Benefits: దోసకాయ తినడం శరీరానికి పోషకాలు అందుతాయి. వీటిని తినడం చాలా మందికి ఇష్టం కూడా. కానీ, వీటిని నీటిలో వేసుకుని ఆ నీరు తాగితే లాభాలు మరింత ఎక్కువ ఉంటాయి. ఈ నీటిని పరిగడపున తాగితే జబ్బులు వచ్చే సమస్యని తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంటుందట. ఈ నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. మరి ఈ నీరును ఎలా తయారు చేసుకోవాలి అంటే..

పై తొక్కని పీల్ చేయాలి. ఆ తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. అంతే ఈ నీటిని ఉదయాన్నే తాగండి. మరి దీన్ని తాగడం వల్ల ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. అయితే దోసకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయనే విషయం తెలిసిందే. కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిని తాగితే విటమిన్ సి, కె, పొటాషియంల, మెగ్నీషియం, మాంగనీస్‌లు శరీరానికి కావాల్సినంత అందుతాయి.

దోసకాయలో ఉండే పొటాషియం రక్తపోటుని నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కుకుర్బిటాసిన్ వంటే సమ్మేళనాలు హైబీపిని తగ్గించడంలో సహాయం చేస్తాయి. దోసకాయలోని ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, లిగ్నాన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ కణాలు దెబ్బతినవు. ఇది వాపుని తగ్గిస్తుంది. గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది.

దోసకాయ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే. ఇందులోని పీచు, నీరు, పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తాయి అంటున్నారు నిపుణులు. అదే విధంగా, ఇందులోని మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని లోపలనుండి కాపాడతాయట. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి ఛాయని మెరుగ్గా చేస్తుంది దోసకాయ నీరు. అయితే డీహైడ్రేషన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయం తెలిసిందే. దోసకాయలో 70 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఈ నీరు హైడ్రేషన్‌ని అందించి.. శరీర ఉష్ణోగ్రతని కంట్రోల్ చేస్తుంది.

ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన, సోషల్ మీడియాలో ఉన్న సమాచారం మేరకు మాత్రమే అందించడం జరుగుతుంది. దీన్ని ఒకే తెలుగు నిర్ధారించదు.