https://oktelugu.com/

Devara: ఎన్టీయార్ దేవర సినిమా కంటే వార్ 2 సినిమా పెద్ద విజయం సాధిస్తుందా..?

ఎన్టీఆర్ 'దేవర ' సినిమాతో పాటుగా 'వార్ 2' సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటికే ఆయన త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 14, 2024 / 09:45 AM IST

    Devara

    Follow us on

    Devara: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఈ సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మొత్తానికైతే ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని ఎన్టీఆర్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ ‘దేవర ‘ సినిమాతో పాటుగా ‘వార్ 2’ సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటికే ఆయన త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేశారు.

    ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కొంతవరకు తగ్గింది అంటూ చాలా విమర్శలైతే వచ్చాయి. మరి వార్ 2 సినిమాలో కూడా మళ్లీ ఆయన పాత్రను తగ్గిస్తున్నారా లేదంటే సినిమాలో తనే కీలకపాత్ర పోషించబోతున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే దేవర సినిమా కంటే కూడా వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా బాగుంటుందని ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించి దేవర సినిమా కంటే బ్లాక్ బస్టర్ హిట్ ను కొడుతుంది. అలాగే వసూళ్ల విషయంలో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది అంటూ మరి కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వార్ 2 సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నారు.

    ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా మీదనే తన ఫుల్ ఫోకస్ పెట్టాడు.
    మరి ఈ సినిమాతో కనక తను సూపర్ సక్సెస్ సాధిస్తే 3 రికార్డ్ లను క్రియేట్ చేసినవాడు అవుతాడు. అందులో ఒకటి రాజమౌళితో సినిమా చేసిన ప్రతి హీరో ఆ తర్వాత చేసిన సినిమా ఫ్లాప్ అవుతుంది అనే పేరు అయితే ఉంది. ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే ఆ రికార్డును బ్రేక్ చేసిన వాడు అవుతాడు.

    అలాగే వరుసగా ఏడు సూపర్ సక్సెస్ లను అందుకున్న స్టార్ హీరోగా కూడా గుర్తింపు పొందుతాడు. సోలోగా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న తెలుగు హీరోగా కూడా గుర్తింపు పొందుతాడు. ఇలా మూడు రికార్డుల కోసమే దేవర సినిమా మీద ఎన్టీయార్ భారీ అంచనాలు పెట్టుకొని అసలేం మిస్టేక్ జరగకుండా తెరకెక్కిస్తున్నారు…