Kagiso Rabada Bowling: డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఈసారి ప్రోటీస్ జట్టు విజేతగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. 1998లో గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత.. దక్షిణాఫ్రికా ఇంతవరకు ఐసీసీ నిర్వహించిన ఏ మేజర్ టోర్నీలో కూడా విజయం సాధించలేదు. చివరికి స్వదేశంలో నిర్వహించిన వన్డే, టి20 వరల్డ్ కప్ లలోనూ ఆశించిన స్థాయిలో సత్తా చూపించలేదు.
గత ఏడాది పొట్టి ప్రపంచ కప్ జరిగినప్పటికీ.. తుది పోరుకు అర్హత సాధించినప్పటికీ.. ప్రోటీస్ జట్టు విజేతగా ఆవిర్భవించలేకపోయింది. ఈ దశలో ఆ జట్టు అనేక అంచనాలు, తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో డబ్ల్యూటీసీ తుది పోరు ఆడేందుకు లార్డ్స్ వెళ్ళింది. ఈరోజు ప్రారంభమైన తుది పోరులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత కంగారు జట్టు పని పట్టింది.. కంగారు జట్టును భారీ స్కోర్ చేయకుండా ఎక్కడికి అక్కడ కళ్లెం వేసింది. ముఖ్యంగా ప్రోటీన్స్ జట్టులో కగిసో, జాన్సన్ దుమ్మురేపారు. వీరిద్దరూ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రొటీస్ బౌలర్ల దూకుడుకు స్మిత్, వెబ్ స్టర్ మినహా మిగతా వారంతా చేతులెత్తేశారు.. స్మిత్, వెబ్ స్టర్ హాఫ్ సెంచరీలు చేయడంతో కంగారు జట్టు ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.. ఖవాజా, గ్రీన్, హెడ్, వెంటనే పెవిలియన్ చేరుకున్నారు.. 23 పరుగులు చేసి క్యారీ సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. అతడు కూడా వెను తిరిగాడు.
ఈ మ్యాచ్లో ప్రోటీస్ జట్టు తరఫున రబాడ ఐదు వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఖవాజా(0), గ్రీన్(4), వెబ్ స్టర్(72), స్టార్క్(1), కమిన్స్(1) వికెట్లను రబాడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 15.4 ఓవర్లు బౌలింగ్ చేసి, 51 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి.. కంగారు జట్టు పతనాన్ని శాసించాడు రబాడా.
ఇటీవల సౌత్ ఆఫ్రికా t20 లీగ్ జరిగినప్పుడు రబాడ డోపింగ్ టెస్టులో దొరికిపోయాడు. అతడు చేసిన పనిని తీవ్రంగా పరిగణించిన సౌత్ ఆఫ్రికా మేనేజ్మెంట్ అతనిపై సస్పెన్షన్ విధించింది. దీంతో అతడు ఐపిఎల్ లో గుజరాత్ జట్టు తరఫున ఆడ లేకపోయాడు.. ఇక సస్పెన్షన్ గడువు ముగిసిన తర్వాత ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడుతున్నాడు. వాస్తవానికి సస్పెన్షన్ కు గురైనప్పుడు కగిసో మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.. ఆ సమయంలో అతడు మౌనాన్ని మాత్రమే ఆశ్రయించాడు. చాలా రోజులపాటు ఎవరితో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. తన ఇంటికి మాత్రమే పరిమితమయ్యాడు. తనలో తాను మదనపడ్డాడు. చివరికి తనను తాను సాన పెట్టుకున్నాడు. ఇదిగో ఇప్పుడు ఇలా మెరిసిపోయి అదరగొట్టాడు. ఐదు వికెట్లు పడగొట్టి కంగారు జట్టు పతనాన్ని శాసించాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 212 పరుగులకు ఆలౌట్ అయింది..వెబ్ స్టర్(72), స్మిత్ (66) టాప్ స్కోరర్లు గా నిలిచారు. జాన్సన్ మూడు వికెట్లు పడగొట్టాడు.. మహారాజ్, మార్క్రం చెరో వికెట్ సాధించారు.
KAGISO RABASA OVER-TAKES ALLAN DONALD IN TEST WICKET TAKERS LIST
– Rabada, One of the finest ever. pic.twitter.com/IBqYcqpEwi
— Johns. (@CricCrazyJohns) June 11, 2025