Pakistan Vs South Africa: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో క్రమశిక్షణ ఉండదు. కెప్టెన్ అంటే మిగతా ప్లేయర్లకు గౌరవం ఉండదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుంది. అందువల్లే ఆ జట్టు పరిస్థితి అంత అద్వానంగా ఉంది. ఇప్పటికే వరుసగా కోచ్ లు మారిపోతున్నారు. జట్టు ఆట తీరు కూడా అంత బాగాలేదు. ఇకపై బాగుంటుందనే నమ్మకం కూడా లేదు. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు మారరు. మారే అవకాశం కూడా లేదు.. గతంలో పాకిస్తాన్ జట్టులో ప్లేయర్లు వాళ్లలో వాళ్లే గొడవపడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులు కామ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు షరా మామూలుగా మొదలుపెట్టారు. ఇటీవల బంగ్లాదేశ్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు వాళ్ళళ్లో వాళ్లే గొడవపడ్డారు. డ్రెస్సింగ్ రూమ్లో బూతులు తిట్టుకున్నారు. అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు అలాంటి ధోరణికి పాల్పడ్డారు. తమ పరువును తామే సింధు నదిలో కలుపుకున్నారు. సాధారణంగా క్రికెట్లో ఎదుటి ఆటగాళ్లను పరి హసించడం జరుగుతూనే ఉంటుంది. అయితే పాకిస్తాన్ ఆటగాళ్లు దీనిని మాత్రం తర్వాతి స్థాయికి తీసుకెళ్తారు. ఇందుకు సంబంధించిన సంఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ కమ్రాన్ గులాం తన అతి ప్రవర్తనతో పాకిస్తాన్ పరువును సింధూ నది పాలు చేశాడు.
సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ లో..
సౌత్ ఆఫ్రికా తో పాకిస్తాన్ జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఇందులో భాగంగా గులాం అతిగా ప్రవర్తించాడు. తన నోటి దూలతో దక్షిణాఫ్రికా కెప్టెన్ రబాడా, యువ ఆటగాడు వెరీన్ తో గొడవపడ్డాడు. రబాడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ వెరిన్ మాత్రం వదిలిపెట్టలేదు. ” ఏం మాట్లాడుతున్నావ్.. నీకు ఏమైనా బుర్ర ఉందా.. నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతావా. ప్రత్యర్థి ప్లేయర్ అనే గౌరవం కూడా నీకు ఉండదా? నీ జట్టు మేనేజ్మెంట్ ఇలానే కోచింగ్ ఇస్తోందా” అంటూ పాక్ బ్యాటర్ మీదకు వచ్చాడు. ” నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఆ కూత కుయ్యి” అంటూ గులాం కు సవాల్ విసిరాడు. వెరిన్ తీవ్రంగా స్పందించడంతో గులాం మరింత రెచ్చిపోయాడు. బూతులను మళ్లీ మొదలు పెట్టాడు.. అయితే ఈ సన్నాసి గాడితో నాకెందుకు అనుకుంటూ వెరిన్ తన ఫీలింగ్ స్థానానికి వెళ్లిపోయాడు. సామాజిక మాధ్యమాలలో కనిపిస్తున్న ఈ వీడియో.. చర్చకు దారి తీస్తోంది.. అయితే పాకిస్తాన్ క్రికెటర్ గులాం పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.. టెస్టులలో ఏడోస్థానంతో సరిపెట్టుకుంటున్న పాకిస్తాన్ జట్టు లో ఆటగాడు ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని.. వారు వ్యాఖ్యానిస్తున్నారు. జెంటిల్మెన్స్ ఆడే గేమ్ లో ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే బూతులు వినిపిస్తాయని చురకలంటిస్తున్నారు.
Can’t believe Kamran Ghulam sledged both keeper as well as the bowler His batted well btw #PAKvsSA pic.twitter.com/8APaccs02N
— U M A R (@Agrumpycomedian) December 26, 2024