Perni Nani Emergency Meeting: ఇక ఇటీవల ఛానల్ లో నిర్వహించిన చర్చా వేదికలో జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆ ఛానల్ వైసీపీ మౌత్ పీస్ కావడంతో.. ప్రభుత్వం తక్షణమే చర్యలకు దిగింది. ఆ చర్చ వేదిక నిర్వహించిన వ్యక్తి, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులను అరెస్టు చేసింది. ప్రస్తుతం వారిద్దరు జైల్లో ఉన్నారు.. ఈ పరిణామం ముగియకముందే.. ఏపీలో గురువారం మరో కీలక సంఘటన చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసింది. అయితే కొంతమంది వైసీపీ నాయకులు నకిలీ పట్టాలను పేదలకు పంపిణీ చేశారని ఆరోపణలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలో నకిలీ పట్టాలను వైసీపీ నాయకులు పంపిణీ చేశారని.. దీని వెనుక అప్పటి మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఉన్నారని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ వ్యవహారంపై అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే తమను ఈ వ్యవహారంలో ముందస్తుగా అరెస్టు చేయొద్దని.. విచారణకు సహకరిస్తామని పేర్ని నాని, ఆయన కుమారుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసు గురువారం విచారణకు రానుంది. ఒకవేళ కేసు లో తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే ఏమిటి.. అనే విషయంపై పేర్ని నాని మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాని తన అనుచరులతో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది.
కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు పేర్ని నాని నుంచి సమాచారం వెళ్ళిందని.. అత్యవసర సమావేశానికి రావాలని ఆయన నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.. కారణం చెప్పకుండా నాని అత్యవసర సమావేశం నిర్వహించడం వెనక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో నాని కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించినప్పుడు.. దాని వెనక బలమైన కారణం ఉండేది. పేర్ని కిట్టు కూడా సమావేశాలు నిర్వహించినప్పుడు దాని వెనుక కూడా బలమైన కారణాలు ఉండేవి. ఆ కారణాలను ఆ సమావేశాలకు ముందే వారు చెప్పేవారు. కానీ ఇప్పుడు కార్యకర్తలకు, ఓకే నాయకులకు కారణం చెప్పకుండానే సమావేశం ఉందని.. అందరూ రావాలని కోరడం రకరకాల చర్చలకు కారణమవుతోంది. దీనిపై మాట్లాడేందుకు వైసిపి నాయకులు నిరాకరిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం పేర్ని నాని, కిట్టు విషయంలో ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు నాని పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు చేసేవారు. అంతేకాదు చంద్రబాబు, ఆయన కుమారుడిపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసేవారు. అవన్నీ కూడా పరిధి దాటిపోవడంతో.. నాటి వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో.. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేషన్ బియ్యం వ్యవహారంలో నాని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నకిలీ పట్టాల విషయంలో కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది? కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం నేడు లభించనుంది.
View this post on Instagram