
Balakrishna Wife Vasundhara: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మాస్ అనే పేరు ఎత్తితే మన అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటికీ, ఆయనని ఏమాత్రం అనుకరించకుండా తనదైన స్టైల్ లో ఊర మాస్ హీరో గా ఎదిగి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.ఆరు పదుల వయస్సు దాటినా ఇప్పటికి కుర్ర హీరోలతో పోటీ పడుతూ ఇండస్ట్రీ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకుంటున్నాడు అంటే ఆయన రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇక బాలకృష్ణ 1982 వ సంవత్సరం లో ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురైన వసుందర దేవి ని పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లోనే వీళ్లిద్దరి పెళ్లి జరిగిపోయింది. అప్పట్లో తెలుగు దేశం పార్టీ ప్రచారం లో ఉన్నందున బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ హాజరు కాలేకపోయాడు. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషనల్ న్యూస్.
ఇక బాలకృష్ణ మరియు వసుందర దేవి దంపతులకు మోక్షజ్ఞ,తేజస్విని మరియు బ్రహ్మణీ సంతానం గా జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే వసుందర దేవి గారు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం చాలా తక్కువ అట.బాలకృష్ణ సినిమాలను సైతం ఆమె ఇంట్లోనే చూస్తుంది. అయితే బాలకృష్ణ కాకుండా ఆమెకి బాగా నచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది విక్టరీ వెంకటేష్ అట.ఆయన సినిమాలను టీవీ లో వచ్చినప్పుడల్లా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుందట.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇక బాలయ్య బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ మరియు వీర సింహా రెడ్డి వంటి సూపర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న బాలయ్య ఈ సినిమా తో హ్యాట్రిక్ పై కన్నేశాడు.