
Kamal Haasan- Sridevi: అందానికి ప్రతిరూపం లాగ ఉండే నటి ఎవరంటే మన అందరికి గుర్తుకు వచ్చే అతి తక్కువ మందిలో ఒకరు శ్రీదేవి. అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి కేవలం లో అందం లో మాత్రమే కాదు, నటనలో కూడా అద్భుతంగా రాణించింది. బాలనటిగా కెరీర్ ని ప్రారంభించిన ఈమె తెలుగు , తమిళం మరియు హిందీ బాషలలో మహారాణిలాగా ఒక వెలుగు వెలిగింది. పాన్ ఇండియన్ స్టార్ కి అర్థం చెప్పిన మొట్టమొదటి హీరోయిన్ ఈమెనే.
నేటి తరం హీరోలందరికీ కూడా ఈమె ఫేవరెట్ హీరోయిన్, అలాంటి లెజెండరీ హీరోయిన్ ని ఆరోజుల్లో పెళ్లి చేసుకోవడానికి ఒక్క హీరో కూడా ముందుకు రాలేదట.శ్రీదేవి తల్లి ఈమె కోసం ఆరోజుల్లో పెళ్లి సంబంధాలు చూసే క్రమం లో కోలీవుడ్ మరియు టాలీవుడ్ హీరోలను కూడా చూసిందని,కానీ ఏవేవో కారణాలు చెప్పి వాళ్ళు ఈ పెళ్లిని తప్పించుకున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు నాటి నుండి నేటి వరకు గట్టిగా వినిపిస్తున్న మాట.

శ్రీదేవి తల్లి చూసిన సంబంధాలలో రాజశేఖర్, జేడీ చక్రవర్తి , అరవింద్ గో స్వామి మరియు పలువురు హీరోలు కూడా ఉన్నారు. అంతే కాదు శ్రీదేవి తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించి విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ని కూడా అడిగిందట శ్రీదేవి తల్లి. కానీ కమల్ హాసన్ కూడా ఒప్పుకోలేదట, పైగా ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ నన్ను పెళ్లి చేసుకుంటే మీరు అసలు భరించలేరు అమ్మా, నన్ను తట్టుకోలేక శ్రీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంటుంది అంటూ చెప్పాడట.
ఇక ఆ తర్వాత కొన్నేళ్ళకు బాలీవుడ్ అగ్ర నిర్మాత బోణి కపూర్ తో ప్రేమాయణం నడిపి, పెళ్లి చేసుకొని బాలీవుడ్ లోనే స్థిరపడిపోయింది శ్రీదేవి. శ్రీదేవి బోణి కపూర్ ని ప్రేమించి పెళ్లాడడం ఆమె తల్లి కి ఇష్టం లేదని, అప్పటి నుండి ఆమె శ్రీదేవి తో మాట్లాడడం మానేసిందనే రూమర్ కూడా ఉంది ఇండస్ట్రీలో.