Actress Rakshitha Shetty: సినిమా సెలబ్రిటీలు అంటేనే ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరులా ఉంటారు. ఇక హీరోలు, హీరోయిన్ల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా సరే యంగ్ కుర్రాళ్ల లాగా కనిపించేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. అందుకే వారికి ఎంత వయసు వచ్చినా సరే ఇంకా యూత్ అన్నట్టే మనకు కనిపిస్తారు. అయితే సినిమా ఫీల్డ్ లో హీరోలకు ఏ వయసు దాకా అయినా అవకాశాలు వస్తాయి.

కానీ హీరోయిన్లకు అలా కాదు.. కొద్ది కాలం తర్వాత హీరోయిన్లుగా ఛాన్సలు రావు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా చివరకు పడిపోక తప్పదు. కానీ అవకాశాలు తగ్గిపోయిన తర్వాత కూడా గ్లామర్‌తో పాటు ఫిట్‌నెస్ మెయింటేన్ చేసే వారు కొంతమందే ఉంటారు. చాలామంది అవకాశాలు తగ్గిపోయాక చబ్బీగా మారిపోతుంటారు. దాంతో వారిని అస్సలు గుర్తు పట్టలేకుండా ఛేంజ్ అయిపోతారు.
ఇప్పుడు కూడా ఓ స్టార్ హీరోయిన్ ఇలాగే మారిపోయింది. ఒకప్పుడు తన ఫిజిక్, గ్లామర్‌తో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం కాస్తంత లడ్డూలా తయారయింది. ఆమె ఎవరో కాదండోయ్..వెటరన్ హీరోయిన్ రక్షిత శెట్టి. రవితేజ ఇడియట్ మూవీతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో పాటు తమిళ, కన్నడ, మళయాల సినిమాల్లో కూడా ఈమె నటించింది.
Also Read: ఆ బిజినెస్ మెన్ తో తమన్నా పెళ్లి !

కానీ అవకాశాలు తగ్గిపోయాక ఆమె బరువు పెరిగిపోయింది. రీసెంట్ గా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తనకు చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే ఇలా మారిపోయినట్టు వివరించింది. కాగా ప్రస్తుతం నటనకు దూరం అయినా.. తన కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉన్నట్టు వివరించింది. ప్రస్తుతం ఆమె కర్ణాటకలో భర్త పిల్లలతో కలిసి జీవిస్తోంది. ప్రస్తుతం ఆమెను ఇలా చూస్తే ఎవ్వరూ గుర్తుపట్టలేకపోతున్నారు.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు