HomeNewsHyundai Exter EV: చిన్నదే కానీ.. పవర్ ఫుల్.. ఈ కారు గురించి తెలుసుకోవాల్సిందే?

Hyundai Exter EV: చిన్నదే కానీ.. పవర్ ఫుల్.. ఈ కారు గురించి తెలుసుకోవాల్సిందే?

హ్యుందాయ్ ‘ఇన్‌స్టర్’ ఎక్స్‌టీరియర్ ఆకర్షణీయమైన, ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంది. దీని దృఢమైన, కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రొఫైల్ రహదారిపై మరింత హుందాగా కనిపించేలా చేస్తుంది. ఇన్‌స్టర్ డిజైన్‌లో హైటెక్ సర్క్యూట్ బోర్డ్-స్టైల్ బంపర్లు, బోల్డ్ స్కిడ్ ప్లేట్లను అమర్చారు.

Hyundai Exter EV: సౌత్ కొరియాకు చెందిన కార్ల కంపెనీ హుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ (EV) కారు ‘ఇన్‌స్టర్’ను తీసుకురానుంది. ఈ కారును మొదట కొరియాలో లాంచ్ చేస్తారు. ఆ తర్వాత మాత్రమే యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ దేశాలకు అందుబాటులోకి వస్తుంది. ఒక్కసారి చార్జి చేస్తే చాలు 355 కిలో మీటర్ల వరకు వెళ్లొచ్చు.

హ్యుందాయ్ ‘ఇన్‌స్టర్’ ఎక్స్‌టీరియర్ ఆకర్షణీయమైన, ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంది. దీని దృఢమైన, కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రొఫైల్ రహదారిపై మరింత హుందాగా కనిపించేలా చేస్తుంది. ఇన్‌స్టర్ డిజైన్‌లో హైటెక్ సర్క్యూట్ బోర్డ్-స్టైల్ బంపర్లు, బోల్డ్ స్కిడ్ ప్లేట్లను అమర్చారు. ఎల్ఈడీ డీఆర్ఎల్, పిక్సెల్ గ్రాఫిక్ టర్న్ సిగ్నల్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

ఇన్‌స్టర్ డ్యూయల్-టోన్ ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్‌లో ఉంటుంది. బ్లాక్ రూఫ్ కాంట్రాస్ట్ రంగు ఉంటుంది. అట్లాస్ వైట్, బిజారిమ్ ఖాకీ మాట్, టోంబోయ్ ఖాకీ, అన్‌బ్లేచ్డ్ ఐవరీ, యారో సిల్వర్ మ్యాట్, సియన్నా ఆరెంజ్ మెటాలిక్, డస్క్ బ్లూ మ్యాట్, బటర్ క్రీమ్ ఎల్లో పెర్ల్, అబిస్ బ్లాక్ పెర్ల్ కలర్లలో దొరుకుతుంది. అదనంగా, ఇన్‌స్టర్ వీల్ ఎంపికలో 15-అంగుళాల స్టీల్, 15-అంగుళాల అల్లాయ్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

లోపలి భాగంలో బ్లాక్, గ్రే, డార్క్ బ్లూ, బీజ్, బ్రౌన్ కలర్ ఆప్షన్లు ఇచ్చారు. వీటితో పాటు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా పర్సనలైజ్ చేసుకునే వీలు కల్పించారు. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ చార్జింగ్, 64 కలర్ ఎల్ఈడీ యాంబియంట్ లైటింగ్, వన్ టచ్ సన్ రూప్ ఫీచర్లు ఉన్నాయి.

ఇన్‌స్టర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 355 కిలో మీటర్ల ప్రయాణిస్తుంది. ఇది దాని సెగ్మెంట్ లో ముందు వరుసలో ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కల్పించారు. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జి చేసుకుంటుంది. ఈ కారు 42 కిలోవాట్లు, 49 కిలోవాట్ల బ్యాటరీలతో రెండు వేరియంట్లలో లభిస్తుంది.

ఇందులో వైర్ లెస్ ఛార్జింగ్ డాక్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. భద్రత కోసం, ఇన్‌స్టర్ కు ఏడీఏఎస్ లభిస్తుంది. ఇందులో లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్, ఫార్వర్డ్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్ ఉన్నాయి. వీటీయూ (వీ2ఎల్) వెహికల్ టు లోడ్ ఫంక్షన్ కూడా ఇచ్చారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper