https://oktelugu.com/

కరెంటు బిల్లు చూసి షాక్ అయిన ఇంటి యజమాని.. ఎంత వచ్చిందో తెలుసా..?

సాధారణంగా ఎంత పెద్ద ఇల్లు అయినా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా కరెంటు బిల్లు రెండు వేలకు మించి రాదు. అదే ఒక పెంట్ హౌస్ అయితే ప్రతి నెల కరెంట్ బిల్లు ఒక 500 వరకు వస్తుంది. కానీ ఓ పెంట్ హౌస్ కి కరెంట్ బిల్లు ఏకంగా 70,939 రూపాయలు రావడం మీరు చూశారా? కానీ బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ పరిధిలోని హైదర్షాకోట్‌ గ్రామంలో చేవెళ్ల నర్సారెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తికి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 21, 2021 / 03:30 PM IST
    Follow us on

    సాధారణంగా ఎంత పెద్ద ఇల్లు అయినా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా కరెంటు బిల్లు రెండు వేలకు మించి రాదు. అదే ఒక పెంట్ హౌస్ అయితే ప్రతి నెల కరెంట్ బిల్లు ఒక 500 వరకు వస్తుంది. కానీ ఓ పెంట్ హౌస్ కి కరెంట్ బిల్లు ఏకంగా 70,939 రూపాయలు రావడం మీరు చూశారా? కానీ బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ పరిధిలోని హైదర్షాకోట్‌ గ్రామంలో చేవెళ్ల నర్సారెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో కరెంటు బిల్లు రావడం చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.

    Also Read: ఆల్ టైం రికార్డుకి సెన్సెక్స్.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

    హైదర్షాకోట్‌ గ్రామంలో చేవెళ్ల నర్సారెడ్డి కాలనీలో బాల్‌రెడ్డి వ్యక్తి నివసిస్తున్నాడు.అయితే ఆ వ్యక్తి తన ఇంటి పెంట్‌హౌస్‌కు ప్రత్యేకంగా మీటరు బిగించాడు. కానీ ఆ హౌస్ కి కరెంటు బిల్లు రాకపోవడంతో ఎన్నోసార్లు విద్యుత్ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులకు ఈ విషయం గురించి తెలియజేశాడు. అయితే అక్కడి అధికారులు ఒక్క రోజు కూడా ఇతని సమస్యను విన్న పాపాన పోలేదు.

    Also Read: చిన్నారితో సహా కారును దొంగతనం చేసిన యువకుడు.. చివరకు..?

    కానీ ఈ నెలకు సంబంధించి కరెంట్ బిల్లు రావడంతో, బాల్ రెడ్డి ఒక్కసారిగా ఆ కరెంటు బిల్లు చూసి షాక్ కి గురి అయ్యాడు. ఇన్నిరోజులు కరెంటు బిల్లు రాలేదని అధికారులకు చెప్పిన వినిపించకపోవడమే కాకుండా ఇప్పుడు ఒక్కసారిగా 70,939 రూపాయలు కరెంటు బిల్లు రావడంతో ఆ యజమాని లబోదిబో మన్నాడు. వెంటనే ఈ విషయం గురించి ఉన్నతాధికారులను సంప్రదించగా ముందు బిల్లు కట్టి రండి, తరువాత ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలియజేయడంతో తనకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ ఇంటి యజమాని తనకు న్యాయం చేయవలసిందిగా ఉన్నత అధికారులను వేడుకున్నాడు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం