ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎడతెగని ‘పంచాయితీ’ నడుస్తోంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు.. సీఎం జగన్ కు మధ్య వార్ లో రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కావడం లేదు.
Also Read: ఏపీలో ఎన్నికల ‘పంచాయితీ’
తాజాగా ఏపీ హైకోర్టులో ఏపీ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని ప్రభుత్వం తరుఫున మంత్రి పేర్నినాని ప్రకటించడంతో ఈ పంచాయితీ ఎన్నికలు ఇప్పట్లో జరగవని అర్థమైంది. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని.. ఎస్ఈసీ నిమ్మగడ్డ అనుకున్నంత మాత్రాన ఎన్నికల కోడ్ అమలు కాదని వెల్లడించారు. న్యాయమూర్తులు మారినా ధర్మం గెలవాలనే కోరుకుంటామని మంత్రి అన్నారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు
ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ టైంలో స్థానిక ఎన్నికలు వద్దంటూ సుప్రీంకోర్టు గడప తొక్కబోతున్నారు. కరోనా , వ్యాక్సినేషన్ ఉన్నందున తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని కోర్టుకెళుతున్నారు. దీంతో ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు.
Also Read: ఎంత గొప్ప పనిచేశావ్?.. అసలు సిసలు లీడర్ అంటే నువ్వేనయ్య హరీష్ రావు
హైకోర్టు తీర్పుతో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని.. ఫిబ్రవరిలోనే ఎన్నికలని కొద్దిసేపటి క్రితమే నిమ్మగడ్డ ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిపై సుప్రీంకోర్టుకు ఎక్కేందుకు రెడీ అయ్యింది. ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్