https://oktelugu.com/

అనిల్ రావిపూడి పర్యవేక్షణలో “గాలి సంపత్” !

“ఎఫ్ 2”, “సరిలేరు నీకెవ్వరు” చిత్రాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి రేంజ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు మనోడు. నిజానికి అనిల్ రావిపూడి మొదట ఒక డైలాగ్ రైటర్ గా స్టార్ట్ అయి… వరుస సక్సెస్ లతో సూపర్ ఛాన్స్ కొట్టేసి.. డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, మొత్తానికి తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో ప్రస్తతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ […]

Written By:
  • admin
  • , Updated On : January 21, 2021 / 03:39 PM IST
    Follow us on


    “ఎఫ్ 2”, “సరిలేరు నీకెవ్వరు” చిత్రాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి రేంజ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు మనోడు. నిజానికి అనిల్ రావిపూడి మొదట ఒక డైలాగ్ రైటర్ గా స్టార్ట్ అయి… వరుస సక్సెస్ లతో సూపర్ ఛాన్స్ కొట్టేసి.. డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, మొత్తానికి తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో ప్రస్తతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు.

    Also Read: తన ప్రియుడు పై పెళ్లి పై హీరోయిన్ ముచ్చట్లు !

    కాగా ప్రస్తుతం అనిల్ “ఎఫ్ 3” సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే, తన మిత్రుణ్ణి నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేస్తూ “గాలి సంపత్” అని సినిమాని రీసెంట్ గా లాంచ్ చేసి.. అనీష్ కృష్ణ అనే కొత్త దర్శకుడికి అవకాశాం ఇస్తూ ఒక సినిమాని నిర్మిస్తున్నాడు. శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ హీరోలుగా ఈ సినిమా రాబోతుంది. అయితే, ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అనిల్ రావిపూడివే కావడం విశేషం. పైగా ఇప్పుడు తన పాత్రని అక్కడికే పరిమితం చెయ్యకుండా దర్శకత్వ పర్యవేక్షణ అనే మరో బాధ్యతను కూడా అనిల్ తీసుకున్నాడు.

    Also Read: బయటపడ్డ యాంకర్ ప్రదీప్ మరో కోణం !

    “ఎఫ్ 3” సినిమా షూటింగ్ షెడ్యూల్స్ లో గ్యాప్ దొరికినప్పుడల్లా అనిల్ రావిపూడి డైరెక్ట్ గా “గాలి సంపత్” షూటింగ్ లొకేషన్ కి వెళ్లి మరి ఆ సినిమా పనులు చూసుకుంటూ పనిలో పనిగా డైరెక్షన్ లో కూడా కాస్త ఇన్ వాల్వ్ అవుతూ.. కొత్త డైరెక్టర్ కి పెద్దగా అవకాశం కూడా ఇవ్వకుండా తానే మొత్తం చూసుకుంటూ ముందుకుపోతున్నాడట. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ కూడా దగ్గరుండి చూసుకున్నాడని అని కూడా తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్