chilli powder: మనలో కొంతమంది కారంతో చేసిన వంటకాలను అమితంగా ఇష్టపడతారు. తీపి పదార్థాలను తినడం వల్ల షుగర్ లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలామంది కారంతో చేసిన వంటకాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. హోటళ్లలో, రెస్టారెంట్లలో తినే సమయంలో కూడా స్పైసీ ఫుడ్ కావాలని కోరుకుంటున్న వాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే.
గర్భవతులైన మహిళలు కారంపొడిని తీసుకుంటే శిశువు ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆస్తమా లాంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లు కారం ఎక్కువగా తినకూడదు. కారం పొడిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆస్తమా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మనలో చాలామందిని నోటిపూత సమస్య వేధిసు ఉంటుంది. కారంపొడి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఎవరైతే కారంపొడిని ఎక్కువగా తీసుకుంటారో వాళ్లను జీర్ణ సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. కారం పొడి ఎక్కువగా తీసుకుంటే వికారంగా అనిపించే అవకాశాలు అయితే ఉంటాయని గుర్తుంచుకోవాలి.