Chanakua nithi: ఈ మధ్య కాలంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చిన్నచిన్న గొడవల వల్ల చాలామంది భార్యాభర్తలు విడిపోతుండటం గమనార్హం. అయితే చాణక్యుడు భార్యాభర్తల మధ్య బంధం జీవితాంతం బలంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచనలు చేయడం గమనార్హం. భార్యాభర్తలు ఒకరిపై మరొకరు కోపం ఎక్కువగా ప్రదర్శించకూడదు.
సరైన కారణం లేకుండా కోపాన్ని ప్రదర్శించడం వల్ల ఒకరిపై మరొకరికి నెగిటివ్ ఫీలింగ్ కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏదైనా పని చేసిన సమయంలో కోపం వస్తే అందుకు గల కారణాన్ని చర్చించుకుని పరిష్కరించుకుంటే మంచిదని చెప్పవచ్చు. కోపంతో చేసే పనుల వల్ల తర్వాత బాధ పడాల్సి ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటే కోపం తగ్గిన తర్వాత మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి.
చాలామంది భార్యాభర్తలలో ఒకరు ఎక్కువని మరొకరు తక్కువని భావనను కలిగి ఉంటారు. ఈ భావన మంచిది కాదు. భార్యాభర్తలు ఒకరిపై మరొకరు పెత్తనం చలాయించుకుంటే వివాహ బంధం దెబ్బ తినే ఛాన్స్ అయితే ఉంటుంది. భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళితే వాళ్లు జీవితాంతం సంతోషంగా గడిపే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
భార్యాభర్తలు ఒకరితో మరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పుకోకూడదు. ఒకరితో మరొకరు నిజాలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తే మాత్రమే జీవితాంతం సంతోషంగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. భార్యాభర్తలు ఏ విషయంలోనైనా ఒకరినొకరు మోసం చేసుకోకూడదు. మోసం చేయకుండా ఉండటం ద్వారా భార్యాభర్తల బంధం లైఫ్ లాంగ్ బలపడుతుంది.