Lata Mangeshkar: భారతీయ గాన కోకిలగా అలాగే భారత నైటింగేల్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. దాదాపు 7 దశాబ్దాలుగా తన పాటలతో అలరించిన ఆమె గురించి తెలియని సంగీత అభిమానులు ఉండరు. ఎన్నో పాటలకు తన చక్కని స్వరాన్ని అందించిన ఆమె.. మనవరాలి వయసున్న యువ హీరోయిన్లకు గాత్రం అందించారు. కానీ గానకోకిల గొంతు మూగబోయింది నేడు.

అయితే, ఆమె గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం. ఆమె సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా కూడా పని చేశారు. లతా మంగేష్కర్ రామ్ రామ్ పహ్వానే అనే చిత్రానికి సంగీత దర్శకురాలిగా పనిచేశారు. ఆ తర్వాత ఆనంద్ ఘన్ అనే పేరుతో 1963లో మరాఠా టితుక మెల్వవా, మోహిత్యంచి మంజుల, 1965లో సాధి మనసే, 1969లో తుంబడి మత అనే చిత్రాలకు పనిచేశారు.
సాధి మనసే సినిమాకు ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. 1953లో వాదాల్, 1955లో ఝంఝర్, కంచన్, 1990లో లేకిన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక లతా మంగేష్కర్ మృతిపై ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. ఇవాళ ఉదయం 8.12 గంటలకు ఆమె చనిపోయినట్లు చెప్పిన డాక్టర్లు.. పలు అవయవాల వైఫల్యంతో తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు.
Also Read: చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తల బంధం నిలబడాలంటే పాటించాల్సిన జాగ్రత్తలివే!
కాగా కరోనా సోకి గత 29 రోజులుగా ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్.. కోలుకుంటున్నారని అనుకునే సమయంలోనే పరిస్థితి విషమించినట్లు డాక్టర్లు నిన్న ప్రకటించగా, ఇవాళ చనిపోయారు.

లతా మంగేష్కర్ తెలుగులో మూడు పాటలే పాడారు.
అన్ని భాషల్లో 30వేలకు పైగా పాటలు పాడిన లతా మంగేష్కర్ తెలుగులో మాత్రం కేవలం మూడు పాటలే పాడారు. 1955లో వచ్చిన ‘సంతానం’ సినిమాలోని ‘నిదురపోరా తమ్ముడా’, 1965లో ‘దొరికితే దొంగలు’ సినిమాలోని ‘శ్రీ వేంకటేశా..’, 1988లో వచ్చిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటలు ఆలపించారు.
Also Read: ఏపీ పీఆర్సీ వివాదం సమాప్తం.. సమ్మె విరమించిన ఉద్యోగ సంఘాలు.. జగన్ సర్కార్ గొప్ప ఊరట
[…] Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఖిలాడీ’. ఈ నెల 11న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ అంచనాలను పెంచగా.. రమేష్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. […]