Hair Health: జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. జుట్టు పెరగాలి అని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే విఫలం అవుతాయి కానీ సఫలం అవవు. అయితే ఖరీదైన వాటితో మాత్రమే కాదు ఇంట్లో ఉండే చాలా పదార్థాలతో మీ జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. ఇంతకీ అవేంటో కూడా చూసేద్దాం.
జుట్టు పెరగడానికి సహాయం చేసే వాటిలో బాదం పప్పు ఒకటి. ప్రతి రోజూ నానబెట్టిన బాదం తినండి. మీకు ఉన్న జుట్టు సమస్యలు తగ్గుతాయి. బాదంలో ఉండే ప్రోటీన్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, ఐరన్, విటమిన్లు జుట్టు పెరగడానికి సహాయం చేస్తాయి.
బాదంతో పాటు వాల్ నట్స్ కూడా జుట్టు పెరగడానికి సహాయం చేస్తాయి. వీటిల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, ఐరన్ మీ జుట్టుకు హెల్ప్ చేస్తాయి. మరో మంచి గింజలు ఏంటంటే పొద్దు తిరుగుడు గింజలు. వాటిలో కూడా ఇవే పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని కూడా మీ డైట్ లో చేర్చుకోండి.
అందరి ఇంట్లో సర్వసాధారణంగా పల్లీలు ఉంటాయి. వీటి వల్ల మీ జుట్టు సమస్యలు తొలిగిపోయి.. జుట్టు బలంగా, దృఢంగా మారతుంది. పల్లీల్లో పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, రాగి మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు ఖర్జూరాలు, చియా సీడ్స్ తీసుకోవడం కూడా మీ జుట్టుకు మంచిది.