BRS: నియంత పోకడలే బీఆర్‌ఎస్‌ను నిండా ముంచాయి..!

తెలంగాణ రాష్ట్ర సమితి స్వరాష్ట్రం కోసం స్థాపించిన పార్టీ. 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో గెలిచిఅధికారం చేపట్టింది. అయితే తర్వాత ఉద్యమకారులను కేసీఆర్‌ పక్కన పెట్టారు. సమైక్య ఆంధ్ర కోసం పోరాడిన వారికి పార్టీలో, ప్రభుత్వంలో పెద్దపీట వేశారు.

Written By: Raj Shekar, Updated On : June 6, 2024 11:19 am

BRS

Follow us on

BRS: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అలియాస్‌ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌)కు ఆరు నెలలుగా ఎన్నికలు కలిసి రావడం లేదు. గతంలో ఎన్నికలు ఏవైనా విజయం బీఆర్‌ఎస్‌దే అనేలా ఫలితాలు వచ్చేవి. దీంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అహంకారం తలకెక్కింది. తాము ఏం చెప్పినా ప్రజలు వింటారు.. తాము ఏం చేసినా ప్రజలు నమ్ముతారు. ప్రజలకు మేమే ప్రభువులం.. తెలంగాణకే మేమే దిక్కు అన్నంతగా పొగరు తలకెక్కింది. కబ్జాలు, అరాచకాలు శ్రుతి మించాయి. దీంతో బీఆర్‌ఎస్‌ను ఓటుతోనే దెబ్బకొట్టాలని తెలంగాణ ప్రజలు డిసైడ్‌ అయ్యారు. అనుకున్నట్లే.. 2023 నంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్‌కు పట్టం కట్టి బీఆర్‌ఎస్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.

లోక్‌సభ ఎన్నికల్లోనూ..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ నేతల్లో తల పొగరు తగ్గలేదు. అదే అహంకార పూరిత మాటలు మాట్లాడడం, తమ ఓటమికి తాము కారణం కాదని, కాంగ్రెస్‌ తప్పుడు హామీలని చెప్పడం, ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశారని ఆరోపించడం.. అధికార కాంగ్రెస్‌పై మొదటి నుంచే ఇష్టానుసారం మాట్లాడడం.. పెరిగాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కేసీఆర్, కేటీఆర్‌లో మార్పు రాలేదని తెలంగాణ ప్రజలు గుర్తించారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో సున్నా చుట్టారు. 2019లో సారు.. కారు.. 16 నినాదంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన టీఆర్‌ఎస్‌ 9 సీట్లు గెలిచింది. తర్వాత పార్టీ పేరు మార్చుకున్నారు. కేసీఆరే ప్రధాని కవాలన్నారు. దేశ్‌ కీ నేత అన్నారు. ఏపీతో పాటు మహారాష్ట్రలో కూడా పార్టీని విస్తరించారు. మూడో సారి కూడా అధికారం మనదే అన్నారు. సీన్‌ కట్‌ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టింది. ఇక లోక్‌ సభ ఎన్నికల్లో కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఆ పార్టీ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది.

నతనానికి కొన్ని కారణాలు..
– తెలంగాణ రాష్ట్ర సమితి స్వరాష్ట్రం కోసం స్థాపించిన పార్టీ. 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో గెలిచిఅధికారం చేపట్టింది. అయితే తర్వాత ఉద్యమకారులను కేసీఆర్‌ పక్కన పెట్టారు. సమైక్య ఆంధ్ర కోసం పోరాడిన వారికి పార్టీలో, ప్రభుత్వంలో పెద్దపీట వేశారు.

– ఇక రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం, కుల పెత్తన సాగింది. తండ్రి సీఎం, కొడుకు షాడో సీఎంగా మారారు. అల్లుడు మినిస్టర్‌ బిడ్డ ఎంపీ, కల బాంధవులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. అయినా.. 2018లో సెంటిమెంటుతో మరోమారు గెలిచారు.

– రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగింది. కేసీఆర్‌ నియంతృత్వం తారాస్థాయికి చేరింది. ప్రజలనే కాదు సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను కూడా కలవకపోవడం ఆ పార్టీకి నష్టం చేశాయి.

– ముఖ్యంగా పార్టీ పేరు మార్చడం ఆ పార్టీ చేసిన పెద్ద తప్పుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 39 సీట్లకే పరిమితమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేదు.

– పార్టీ స్థాపించిన నుంచి ఇప్పటి వరకు ఎదో చోట బీఆర్‌ఎస్‌ గెలుస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవలేక నాలుగో స్థానానికి పడిపోయింది. దీంతో బీఆర్‌ఎస్‌ కథ ముగిసిందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.