Pot Water: నీరు తాగడం ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నీటి వల్ల చాలా సమస్యలు తొలిగిపోతాయి. ఎన్నో వ్యాధులను తగినంత నీరు తాగడం వల్ల పులిస్టాప్ పెట్టవచ్చు. శరీరాన్ని డీ హైడ్రేట్ అవకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే కొందరు ఫ్రిజ్ వాటర్ తాగుతారు. కానీ ఈ నీళ్లను తాగకూడదు అంటారు నిపుణులు. కానీ ఎండాకాలంలో నార్మల్ వాటర్ తాగాలంటే చాలా కష్టం కదా. అందుకే కుండ నీరు బెటర్ అనిపిస్తుంది. మరి ఈనీరు తాగవచ్చా? లేదా? దీని వల్ల ఏమైన ప్రయోజనాలు ఉన్నాయా అనే విషయం తెలుసుకుందాం.
కుండలోని నీరు చల్లదనాన్ని మాత్రమే కాదు ఖనిజాలు అందిస్తాయి. ఇందులోని ఆల్కలీన్ లక్షణాలు శరీరం పీహెచ్ స్థాయిలను నిర్వహించడంలో హెల్ప్ చేస్తాయి. ఈ నీళ్లు తాగడం మంచిదే కానీ కొన్ని విషయాలు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే కుండని శుభ్రం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
1..మీ బద్దకంతో కుండను కడగకుండా అలాగే ఉంచకండి. దీని వల్ల అంటే మట్టి వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అందుకే ప్రతి రోజు స్క్రబర్ తో కుండను క్లీన్ చేయండి.
2. డైరెక్ట్ కుండను తేగానే అందులో వాటర్ పోసి తాగేయకండి. కుండను దాదాపు రెండు రోజులు నీటిలో నానబెట్టిన తర్వాత ఉప్పు వేసి స్క్రబ్బర్‌తో శుభ్రం చేసిన తర్వాత నీళ్లు తాగండి.
3. ఈ కుండను శుభ్రం చేయడానికి ఓ లిక్విడ్‌ను సిద్ధం చేసుకోండి.దీని కోసం ఓ బౌల్‌లో బేకింగ్ సోడా, వైట్ వెనిగర్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపితే లిక్విడ్ తయారు అవుతుంది. దీంతో కుండను శుభ్రం చేసుకోవచ్చు.
4. ఒకసారి కుండను తెచ్చుకుంటే సంవత్సరం పాటు ఉపయోగించవచ్చు. కానీ ఆ తర్వాత మరోసారి కుండను మార్చాలి.