DSC 2024 Results : డీఎస్సీ 2024 రిజల్ట్స్‌ ఆ రోజే.. కొత్త టీచర్ల నియామకంపై రేవంత్‌ సర్కార్‌ సూపర్‌ ప్లాన్‌!

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గురుకుల పోస్టులు భర్తీ చేసింది. తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టింది. ఇప్పుడు డీఎస్సీపై దృష్టిపెట్టింది.

Written By: Raj Shekar, Updated On : August 20, 2024 11:18 am

TS DSC 2024 Results

Follow us on

DSC 2024 Results : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రాధాన్యం ఇస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏటా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేవారు. ఆయన శిష్యుడు, తెలంగాణ సీఎం అయిన రేవంత్‌రెడ్డి కూడా గురువు బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం విడుదల చేసిన 9 వేల గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టారు. దాదాపు 7 వేల మందికి నియామకం పూర్తి చేశారు. అంతకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ రద్దు చేసి కొత తనోటిఫికేషన్‌ విడుదల చేశారు. తర్వాత టెన్‌ నిర్వహించారు. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ప్రతిపక్షంతోపాటు విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా పరీక్ష వాయిదా వేయకుండా జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించారు. 9,062 పోస్టులను కూడా త్వరగా భర్తీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. అతి త్వరలో సెలక్షన్‌ లిస్ట్‌ ఇచ్చేసి నియామక పత్రాలు అందజేయాలని ప్లాన్‌ చేస్తోంది. మెగా డిఎస్సీ 2024కి సంబంధించి ఇటీవలే ప్రిలిమినరీ కీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ కీ పై అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 20వ తేదీతో ఈ గడువు కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో డీఎస్సీ రిజల్ట్స్‌కు సంబంధించి మరో కీలక విషయం బయటకొచ్చింది.

త్వరగా నియామకాలు..
సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్లను నియమించాలనే ఉద్దేశంతో ఉన్న సర్కార్‌.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరణ పూర్తయిన వెంటనే ఫైనల్‌ కీని రిలీజ్‌ చేసి, అనంతరం జనరల్‌ ర్యాకింగ్‌ లిస్టును ప్రకటించనున్నారని సమాచారం. ఈ లెక్కన చూస్తే ఆగస్టు మూడో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రిజల్ట్స్‌ వదిలిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసి ఆ వెంటనే నియామక పత్రాలు ఇవ్వనున్నారట. ప్రభుత్వం ఈ ఏడాది మెగా డీఎస్సీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి స్వీకారం చుట్టింది. ఇందులో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు.. 182 పీఈటీలు.. 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

సెప్టెంబర్‌ 5న నియామక పత్రాలు..
అయితే ఈసారి టీచర్‌ పోస్టులకు ఎంపికైన వారికి సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్‌ 5న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తారని తెలుస్తోంది.