https://oktelugu.com/

MLA Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి ఎపిసోడ్ లో బాధితురాలిగా ఈసీ

మాచర్ల నియోజకవర్గంలో విధ్వంసాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను పిన్నెల్లి ధ్వంసం చేసిన సి సి ఫుటేజ్ లు బయటకు వచ్చాయి. దీనిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్ కు దిగింది.

Written By:
  • Dharma
  • , Updated On : May 24, 2024 / 09:31 AM IST

    MLA Pinnelli Ramakrishna Reddy

    Follow us on

    MLA Pinnelli Ramakrishna Reddy: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో ఈసీ బాధితురాలిగా మిగిలిందా? వ్యవస్థలన్నీ ఆయనకు సపోర్ట్ చేశాయా? అరెస్టు నుంచి ముందస్తు బెయిల్ మంజూరు వరకు కొందరు అధికారులు పావులు కదిపారా? ఎన్నికల ఫలితాల వరకు రిలాక్స్ దొరకడం వెనుక వారి హస్తం ఉందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఫలితాలు వచ్చేవరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి చిన్నపాటి బ్రేక్ దొరికింది. జూన్ 4 తర్వాత వచ్చే ఫలితాలు అనుగుణంగా పిన్నెల్లి అడుగులు ఉంటాయి. ఆయన రాజకీయ జీవితం ఉంటుంది.

    మాచర్ల నియోజకవర్గంలో విధ్వంసాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను పిన్నెల్లి ధ్వంసం చేసిన సి సి ఫుటేజ్ లు బయటకు వచ్చాయి. దీనిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్ కు దిగింది. తక్షణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించింది. అక్కడి నుంచి ఆయన ఎపిసోడ్ నడిచింది. అదిగో అరెస్ట్.. ఇదిగో అరెస్ట్ అంటూ హడావిడి సాగింది. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు అధికారుల హస్తం ఉందని ప్రచారం సాగింది. ఇంతలో హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి ముందస్తు బెయిల్ ను దక్కించుకున్నారు. తాత్కాలిక ఉపశమనం పొందారు.

    అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ బాధితురాలిగా మిగిలింది. జూన్ 4న ఫలితాలు బట్టి పిన్నెల్లి భవితవ్యం కొనసాగనుంది. ఒకవేళ తాను గెలిచి.. వైసిపి ఓడిపోతే.. ఆయన మాచర్ల నియోజకవర్గం లో అడుగుపెట్టే చాన్స్ లేదు. తనతో పాటు వైసిపి ఓడిపోతే ఆయన రాష్ట్రంలోనే కనిపించరు. ఒకవేళ వైసీపీ గెలిస్తే మాత్రం.. ఆయన ఈ కేసు నుంచి బయటపడినట్టే. లేకుంటే మాత్రం అటు ఈసీ చర్యలకు, ఇటు క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రత్యర్థులకు తప్పనిసరిగా టార్గెట్ అవుతారు. ప్రజాక్షేత్రంలో అవమానాలు పడటం ఖాయం. అందుకే జూన్ 4న వచ్చే ఫలితాలు.. అందరికంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కీలకం.