Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తనను ఆర్థికంగా కొన్ని చిత్రాలు దెబ్బతీశాయని వెల్లడించారు. తాను కాబట్టి పరిశ్రమలో ఉన్నాను మరొకరైతే ఆత్మహత్య చేసుకునేవారు. లేదంటే పరిశ్రమ నుండి పారిపోయేవారని చెప్పుకొచ్చారు. అజ్ఞాతవాసి చిత్రం ఆర్థికంగా గుల్ల చేసిందని దిల్ రాజు అన్నారు. 2017లో అజ్ఞాతవాసి నైజాం హక్కులు కొన్నాను. 2018 సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తో భారీగా నష్టం జరిగింది. కెరీర్లో అది అతి పెద్ద కుదుపు. బాగా నష్టపోయాను. అలాగే మహేష్ స్పైడర్ మూవీ కూడా నష్టాలు మిగిల్చిందని చెప్పారు.

అజ్ఞాతవాసి, సైడర్ పరాజయాలతో పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాను. ఇంకొకరైతే ఆత్మహత్య చేసుకునేవారు. లేదంటే పరిశ్రమ నుండి పారిపోయేవారు. నేను కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డాడు. తర్వాత నిర్మాతగా ఆరు హిట్స్ కొట్టాను. పోయిన డబ్బు తిరిగి తెచ్చుకున్నాను అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అత్తారింటికి దారేది మూవీ తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం బ్యాడ్ టాక్ కారణంగా నష్టాలు మిగిల్చింది.
ఇది దర్శకుడు మురుగదాస్ కి తెలుగులో కూడా గుర్తింపు ఉంది. ఫార్మ్ ఉన్న మురుగదాస్-మహేష్ కాంబినేషన్ పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ప్రోమోలకు మంచి స్పందన వచ్చింది. సినిమాలో కంటెంట్ ఉన్నప్పటికీ విలన్ డామినేషన్ ఎక్కువై సినిమా పరాజయం పొందింది. ఈ రెండు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు బుక్ అయిపోయాడు. కాగా ఈ సంక్రాంతికి ఆయన నిర్మాతగా ఉన్న వారసుడు చిత్రం విడుదల అవుతుంది.

హీరో విజయ్ నటించిన వారసుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్. వారసుడు డబ్బింగ్ చిత్రం కాగా సంక్రాంతికి విడుదల చేయకూడదంటూ తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్నారు. అయితే దిల్ రాజు ఈ విషయంలో తన మార్కు రాజకీయం నడిపి పంతం నెగ్గించుకున్నారు. వారసుడు జనవరి 12న విడుదల కానుందని సమాచారం. ఇక వారసుడు కోసం పెద్ద మొత్తంలో థియేటర్స్ లాక్ చేసిన దిల్ రాజు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను దెబ్బ తీసే స్కెచ్ వేశాడన్న ప్రచారం జరుగుతుంది.