Khushi Re Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ ఈ నెల 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలవ్వబోతుంది..అభిమానుల కోరిక మేరకు 4K క్వాలిటీ తో ప్రింట్ ని మార్చి డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ తో ఈ సినిమాని రీ మాస్టర్ చేసారు..ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు విడుదల చెయ్యాల్సింది కానీ అదే సమయం లో అభిమానులు జల్సా సినిమాని ప్లాన్ చెయ్యడం తో ఖుషి విడుదల ని ఆపేసారు.

న్యూ ఇయర్ కానుకగా విడుదల చేస్తామని ఎప్పుడో చెప్పారు ఆ చిత్ర నిర్మాత AM రత్నం..చెప్పిన మాట ప్రకారమే అభిమానుల కోసం రీ రిలీజ్ ని గ్రాండ్ గా చేస్తున్నాడు..అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఘనంగా ప్రారంభించారు..బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతీ చోట నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి..స్టార్ హీరో కొత్త సినిమా విడుదలైతే ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయో..ఖుషి సినిమాకి కూడా ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లో ఖుషి ప్రభంజనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు..హైదరాబాద్ లో ఇప్పటి వరకు 150 షోస్ ఓపెన్ చేస్తే అన్ని షోలు దాదాపుగా హౌస్ ఫుల్ అయ్యాయి..సిటీ మారుమూల ప్రాంతం లో కూడా హౌస్ ఫుల్స్ పాడడం విశేషం..ఇప్పటి వరకు ఈ సినిమాకి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే హైదరాబాద్ నుండి కోటి 20 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇప్పటి వరకు రీ రిలీజ్ అయినా ప్రాంతీ ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ ని ఖుషి చిత్రం కేవలం హైదరాబాద్ సిటీ నుండే బ్రేక్ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.

ఇంకా షోస్ యాడ్ చేస్తూనే ఉన్నారు..హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి..కచ్చితంగా ఈ చిత్రం కేవలం నైజాం ప్రాంతం నుండే జల్సా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లను బ్రేక్ చేసినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..సినిమా వారం రోజుల పాటు రన్ ఉండడం తో కచ్చితంగా ఫుల్ రన్ లో ఎవ్వరు అందుకోలేని రికార్డుని నెలకొల్పడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు.