spot_img
Homeఎంటర్టైన్మెంట్Waltair Veerayya Ravi Teja: 'వాల్తేరు వీరయ్య' కోసం రవితేజ ఎన్ని సినిమాలు వదులుకున్నాడో...

Waltair Veerayya Ravi Teja: ‘వాల్తేరు వీరయ్య’ కోసం రవితేజ ఎన్ని సినిమాలు వదులుకున్నాడో తెలుసా?

Waltair Veerayya Ravi Teja:  టాలీవుడ్ లో ఈమధ్య క్రేజీ ప్రాజెక్ట్స్ చాలా తేలికగా సెట్ అయిపోతున్నాయి..మల్టీస్టార్ర్ర్ సినిమాలు ఒకప్పుడు తియ్యడానికి డైరెక్టర్స్ చాలా బయపడేవాళ్లు..కానీ ఇప్పుడు స్టార్ హీరోలు సైతం మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు..ఈ జనరేషన్ మాస్ హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి చేసిన #RRR సక్సెస్ అవ్వడం తో మరిన్ని క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమాలు పుట్టుకొస్తున్నాయి..ఆ కోవలోకి చెందిన సినిమానే మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం.

Waltair Veerayya Ravi Teja
Waltair Veerayya Ravi Teja

ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటించాడు..ఆయన పాత్ర నిడివి ఇందులో 45 నిమిషాల వరకు ఉంటుంది..ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని ఇందులో ఆయన పోషించాడు..విక్రమార్కుడు తర్వాత అంత పవర్ ఫుల్ పాత్రలో రవితేజ ని ఇందులో డైరెక్టర్ బాబీ చూపించినట్టు సమాచారం..అయితే ఈ సినిమాలో రవితేజ నటించడానికి ముందు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి ఈ సినిమాలోని రవితేజ పాత్ర కోసం మెగా హీరో ని చేయించాలనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ బాబీ..కానీ అప్పటికే చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తో చేసిన ‘ఆచార్య’ సినిమా విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో మళ్ళీ మెగా హీరో అంటే ఆడియన్స్ కి కాస్త రొటీన్ ఫీలింగ్ వస్తుందని చిరంజీవి రవితేజ ని సజస్ట్ చేసాడట..అప్పుడు వెంటనే రవితేజ ని డైరెక్టర్ బాబీ సంప్రదించి ‘ఇలా చిరంజీవి గారి సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్ర ఉంది..చేస్తారా’ అని అడగగానే స్టోరీ కూడా వినకుండా రవితేజ ఒప్పుకొని ఈ సినిమా చేసాడట..అప్పటికే ఆయన మూడు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు.

Waltair Veerayya Ravi Teja
Waltair Veerayya Ravi Teja

అందులో ‘రావణాసుర’ కూడా ఒకటి..ఈ సినిమా షూటింగ్ ని వాయిదా వేసిమరీ ‘వాల్తేరు వీరయ్య’ కోసం డేట్స్ కేటాయించాడట..మధ్యలో డైరెక్టర్ వేణుశ్రీరామ్ తో కూడా ఒక సినిమా చెయ్యాల్సి ఉంది..కానీ చిరంజీవి సినిమా కోసం ఆ చిత్రాన్ని కూడా వదిలేసాడట రవితేజ..ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..దీనిని బట్టి రవితేజ కి చిరంజీవి అంటే ఎంత అభిమాన అనేది అర్థం చేసుకోవచ్చు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...
Oktelugu Epaper
Exit mobile version