AP Jobs: ఏపీలోని విజయనగరంలో 96 ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

AP Jobs: ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్ కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. బయోమెడికల్ ఇంజనీర్లు, జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఆడియోమిట్రిక్‌ టెక్నీషియన్‌, ల్యాబ్ అటెండెంట్లు, కౌన్సెలర్లు, పోస్టు మార్టం అసిస్టెంట్లు, రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్ జాబ్స్ ను […]

Written By: Navya, Updated On : February 20, 2022 6:04 pm
Follow us on

AP Jobs: ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్ కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. బయోమెడికల్ ఇంజనీర్లు, జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఆడియోమిట్రిక్‌ టెక్నీషియన్‌, ల్యాబ్ అటెండెంట్లు, కౌన్సెలర్లు, పోస్టు మార్టం అసిస్టెంట్లు, రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్ జాబ్స్ ను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

AP Jobs

18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 15,000 రూపాయల నుంచి 52,000 రూపాయల వరకు వేతనంగా లభించనుందని తెలుస్తోంది. పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ కావడంతో పాటు పదో తరగతి నుంచి డిగ్రీ మధ్య అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.

Also Read: కేసీఆర్ కు ప్ర‌కాశ్ రాజ్ స్వాగ‌తం.. మీ ప్లానేంది గులాబీ బాస్..?

అనుభవం, రిజర్వేషన్‌, అకడమిక్ మెరిట్ ను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆఫ్‌లైన్‌ ద్వారా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ విజయనగరం అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. జనరల్‌ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉంది.

వికలాంగ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు విషయంలో మినహాయింపు ఉంటుందని సమాచారం అందుతోంది. https://vizianagaram.ap.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు, అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

Also Read: ఉద్ధ‌వ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ.. టార్గెట్ బీజేపీ..?