Telangana CM KCR: మూడో కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరం చేశారు కేసీఆర్. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలతో జట్టు కట్టేందుకు రెడీ అయిపోతున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడు, కేరళ, ఫశ్చిమబెంగాల్ సీఎంలను కలిసిన ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పిలుపు మేరకు ఆయనను కలవడానికి ఆదివారం ముంబై వెళుతున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. బీజేపీని గద్దె దించాలనే ఉద్దేశంతో కాలుకు బట్ట కట్టకుండా తిరుగుతున్నారు. బీజేపీని ఎదుర్కోవాలనే తాపత్రయంతోనే కేసీఆర్ ముందడుగు వేస్తున్నా ఫ్రంట్ ఏర్పాటుకు ఇంకా భారీ కసరత్తే జరగాలి.
దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసే పనికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ఏవో మూడు నాలుగు రాష్ట్రాలు కలిసినంత మాత్రాన అందరు కలవాలని లేదు. ఇందులో కొందరు వ్యతిరేకించొచ్చు కొందరు సమ్మతించొచ్చు. కానీ అన్ని పార్టీలను ఐక్యం చేయాలంటే చాలా ఓపిక కావాలి. దానికి కేసీఆర్ ఇంకా తిరగాల్సి ఉంటుంది. మొత్తానికి బీజేపీని టార్గెట్ చేసుకుని దేశమంతా పర్యటించేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.
కానీ సర్వేలు మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్ గెలవడం కష్టమేనని చెబుతున్నాయి. దీంతో కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయి ఏమి ఏరతాడని విమర్శలు వస్తున్నాయి. ఇందుకు ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇది మగల పుట్టి పుబల పోతుంది అని ఎద్దేవా చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం కూడా వారి మాటలు పట్టించుకోకుండా దేశంలో ప్రత్యామ్నాయం కోసమే తాపత్రయ పడుతున్నట్లు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: KCR Medaram: కేసీఆర్ సార్ మేడారం రాకపోయే.. విమర్శల జడివాన మొదలాయే!
మొత్తానికి కేసీఆర్ ప్రణాళిక కచ్చితంగా అమలు అవుతుందా? ఆయనకు అందరు మద్దతు తెలుపుతారా? లేక చేతులు కాల్చుకుంటారా? అని అందరిలోఅనుమానాలు వస్తున్నాయి. దీంతో కేసీఆర్ వ్యూహాలు దేశంలో ప్రయోజనాలు సాధిస్తాయా? మూడో కూటమి ఏర్పాటు పనుల్లో ఇప్పటి వరకు ఒక బెంగాల్ ముఖ్యమంత్రి మినహా ఆయనతో కలిసిన వారు ఎవరు కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కానీ కేసీఆర్ మాత్రం ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పుకుని తిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో మూడో కూటమి ప్రయత్నాలు ఎంతవరకు సాగుతాయో తెలియడం లేదు. రాష్ట్రంలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ ప్రయత్నాలు చేపడుతున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం అధికారం పోవడం ఖాయమేనని తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిపిన సర్వేలో చాలా మంది ఓటమి అంచుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కేసీఆర్ అక్కడ చక్రం తిప్పినా ఇక్కడ మాత్రం ఓడిపోతారని వాదనలు కూడా వస్తున్నాయి.
Also Read: CM KCR-Chinna Jeeyar: పేరు లేదనే అలకబూనిన కేసీఆర్ః వివరణ ఇచ్చిన జీయర్ స్వామి
Recommended Video: