Manchu Manoj : మంచు కుటుంబం లో మళ్ళీ వివాదం చోటు చేసుకుంది. గత ఏడాది డిసెంబర్ నెల లో మొదలైన ఈ గొడవ, ఈమధ్య కాలం లో కాస్త చల్లారింది. కానీ ఇప్పుడు మళ్ళీ మనోజ్(Manchu Manoj) తనకు న్యాయం జరగాలని రోడ్ ఎక్కాడు. జల్ పల్లి లో ఉన్నటువంటి మోహన్ బాబు(Manchu Mohan Babu) ఇంటి గేట్ ముందు బైఠాయించి ధర్నా చేశాడు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇన్ని రోజులు మీడియా ముందు నోరు విప్పని మనోజ్, నేడు మాత్రం చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘గడిచిన కొంత కాలం నుండి మా ఇంట్లో జరుగుతున్న గొడవలను మీరంతా చూస్తూనే ఉన్నారు. నేను మౌనం గా ఉండాలనే అనుకున్నాను కానీ, హద్దులు దాటేస్తున్నారు. నాకు హక్కులను కాలరాస్తున్నారు., అందుకే నోరు విప్పాల్సి వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : మోహన్ బాబు ఇంటి గేట్ ముందు ధర్నా కి దిగిన మంచు మనోజ్..వీడియో వైరల్!
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘హైకోర్టు ఈ ఇంట్లో నేను ఉండేందుకు అనుమతిని ఇచ్చింది. కానీ నన్ను రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఎందుకు రానివ్వట్లేదో చెప్తే నేను మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కుతాను. CI గారిని కలిసి హై కోర్టు మాకు ఇంట్లో ఉండొచ్చని అనుమతిని ఇచ్చింది,అందుకే ఇక్కడికి వచ్చాను, అయినా నన్ను ఆపేస్తున్నారు అని చెప్తే, మీరు ఈమధ్య ఇక్కడ ఉండట్లేదు అంట కదా సార్ అని అడిగారు. మరి మార్చి లో నేను ఇక్కడి నుండే కదా మీతో మాట్లాడాను, అప్పుడే మర్చిపోయారా అని అడిగితే ఆయన నుండి సమాధానం లేదు. నా ఇంట్లో కూతురు కోసం దాచుకున్న నగలను ద్వంసం చేశారు, నా వస్తువులన్నీ విసిరేశారు, చివరికి నా కారుని కూడా దొంగ తాళాలు ఉపయోగించి తీసుకెళ్లిపోయారు. విష్ణు ఎందుకు ఇంత దిగజారిపోతున్నాడో నాకు అర్థం కావడం లేదు. నాకంటే అతను నాలుగేళ్లు పెద్ద కదా, అతనికీ పిల్లలు ఉన్నారు కదా, ఈ వయస్సులో మా అమ్మానాన్నలకు ఈ తలనొప్పులు అవసరమా చెప్పండి, కూర్చొని మాట్లాడుకుందాం రా అంటే ఎందుకు రావడం లేదు’ అంటూ నిలదీసాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను నా భైరవం(Bhairavam Movie) సినిమాని కన్నప్ప(Kannappa Movie) కి పోటీ గా వేస్తాను అంటే భయపడి పారిపోయాడు. ఆ కక్ష్య మొత్తం ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నాడు. నేను ఏమి పాపం చేసానని నా మీద ఇంత పగ. మీ సినిమాలకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేసాను, క్యాంపస్ కోసం కష్టపడ్డాను, నేను పక్క బ్యానర్ లో సూపర్ హిట్ కొడితే, వెంటనే తన బ్యానర్ లో సినిమా చేయాలనీ పట్టుబట్టి నన్ను లాక్ చేసేవారు. మా నాన్న వాడు హీరో గా నిలబడాలి రా, నువ్వు ఈ చిత్రం లో ఆడవేషం వేస్తేనే వాడి కెరీర్ బాగుపడుతుంది అని మా నాన్న అడిగితే, నా అన్నకోసం ఆడవేషం కోసం వేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. అసలు ఎందుకు మీ మధ్య గొడవలు అని రిపోర్టర్ అడిగితే ‘మా అమ్మ, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆస్తి కోసం నేను గొడవపడట్లేదు. క్యాంపస్ లో విష్ణు పిల్లల నుండి దోచుకుంటున్న విధానంపై మాత్రమే నేను పోరాడుతున్నాను. చిన్నప్పటి నుండి విష్ణు కి నేనంటే కుళ్ళు, మా నాన్న దగ్గరకి వెళ్లి మనోజ్ జుట్టు నా చేతుల్లో ఉండేలా చేయమని ప్రమాణం తీసుకున్నాడు, మా నాన్న కూడా అందుకు సరే అన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : ఫ్యామిలీ తగాదాల పై ఎట్టకేలకు అసలు నిజాలు బయటపెట్టిన మంచు మనోజ్.. ఇంత జరిగిందా !