
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. కొత్తగా 12వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 98,048 శాంపిల్స్ పరీక్షించగా 12,768 మంది కరోనా బారనపడినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 15,612 మంది కరోనా నుంచి కోలుకోవడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,62,229లకు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ 98 మంది మరణించారు.