బన్నీకి ఇది బాధాకరమైన విషయమే ! 

అల్లు అర్జున్ కి విపరీతమైన ఫాలోయింగ్ అండ్ క్రేజ్ ఉందని బన్నీ అభిమానులు తెగ ఫీల్ అవుతూ ఉంటారు. పైగా ఈ మధ్య బన్నీ గ్రాఫ్ పైకి ఎగబాకుతోందని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తూ హడావుడి చేస్తుంటారు. ముఖ్యంగా ‘అల వైకుంఠపురంలో’ సినిమా భారీ హిట్ అయి, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డును క్రియేట్ చేయడంతో బన్నీకి ఇక తిరుగు లేదు అనుకున్నారు. దీనికితోడు బన్నీ తన పాపులారిటీని పాన్ ఇండియా రేంజ్ లో మరింత […]

Written By: admin, Updated On : June 3, 2021 9:55 am
Follow us on

అల్లు అర్జున్ కి విపరీతమైన ఫాలోయింగ్ అండ్ క్రేజ్ ఉందని బన్నీ అభిమానులు తెగ ఫీల్ అవుతూ ఉంటారు. పైగా ఈ మధ్య బన్నీ గ్రాఫ్ పైకి ఎగబాకుతోందని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తూ హడావుడి చేస్తుంటారు. ముఖ్యంగా ‘అల వైకుంఠపురంలో’ సినిమా భారీ హిట్ అయి, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డును క్రియేట్ చేయడంతో బన్నీకి ఇక తిరుగు లేదు అనుకున్నారు.

దీనికితోడు బన్నీ తన పాపులారిటీని పాన్ ఇండియా రేంజ్ లో మరింత పెంచుకునేందుకు ‘పుష్ప’ సినిమాని పాన్ ఇండియా సినిమాగా మార్చేలా చర్యలు తీసుకున్నాడు. తన తరువాత సినిమాలను కూడా పాన్ ఇండియా సినిమాలుగానే తీసుకువస్తూ.. తనకంటూ దేశ వ్యాప్తంగా ఓ మార్కెట్ ను సృష్టించుకోవడానికి అల్లు అర్జున్ చాల ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే అల్లు అర్జున్ కి హీరోగా మంచి స్టార్ డమ్ ఉన్నప్పటికీ, బన్నీ అంత డిజైరబుల్ కాదు అంటూ హైదరాబాద్ టైమ్స్ పత్రిక మొత్తానికి తేల్చి చెప్పింది. హైదరాబాద్ టైమ్స్ పత్రిక 2020వ సంవత్సరానికి గాను తాజాగా 30 మంది సెలెబ్రిటీలతో కూడిన డిజైరబుల్ మెన్ లిస్ట్ ని అధికారికంగా ప్రచురించి.. బన్నీ ఫ్యాన్స్ కు నిరాశను కలిగించింది.

ఈ పత్రిక అల్లు అర్జున్ స్థానం 16వ స్థానాన్ని ఇవ్వడం, నాగశౌర్య లాంటి హీరోకి 5వ స్థానం ఇవ్వడంతో చర్చనీయాంశం అయింది. నిజంగా టాప్ టెన్ లో కూడా బన్నీకి చోటు దక్కలేదు అంటే కచ్చితంగా ఇది విచిత్రమే. టాప్ 10లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారు అంటే ఓకే. విజయ్ దేవరకొండ, రామ్, నాగ శౌర్య, నాగ చైతన్య లాంటి హీరోలు కూడా టాప్ టెన్ లో ఉండి, బన్నీ 16వ స్థానానికి పరిమితం కావడం బాధాకరమైన విషయమే.