https://oktelugu.com/

కేసీఆర్ ను బండి సంజయ్ జైలుకు పంపిస్తాడట..

తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమకు ప్రత్యేక వ్యూహం ఉందని చెప్పారు. కేసీఆర్ చేస్తున్నదారుణాలు చూస్తున్నామని పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తూ రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఈమేరకు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీలు చేసే విమర్శలు పట్టించుకోమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 2, 2021 / 05:24 PM IST
    Follow us on

    తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమకు ప్రత్యేక వ్యూహం ఉందని చెప్పారు. కేసీఆర్ చేస్తున్నదారుణాలు చూస్తున్నామని పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తూ రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు.

    ఆయన ఈమేరకు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీలు చేసే విమర్శలు పట్టించుకోమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలు పూర్తిగా సేకరించామని చెప్పారు. టీఆర్ఎస్ 18 మంది ముఖ్య నేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకుని ముందుకు వెళతామని అన్నారు. చివరకు విజయం సాధించి తీరుతామని పేర్కొన్నారు.

    బీజేపీ ఉద్యమ పంథా వేరుగా ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు పూర్తిగా తీసుకున్నామన్నారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కేసులపైనే ఆరా తీస్తున్నామని చెప్పారు. ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద అవినీతికి పాల్పడ్డారో తేలిపోయిందని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో బీజేపీలో చేరతారని స్పష్టం చేశారు. ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటామని పేర్కొన్నారు.

    ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి కొన్ని షరతులు విధించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై బండి సంజయ్ స్పందించారు. ఎలాంటి హామీ లేకుండానే పార్టీలో చేరుతున్నారని వివరించారు. బీజేపీలో ఎవరు చేరినా హామీ ఉండదని తేల్చారు. బీజేపీ సిద్దాంతాలతోపాటు ప్రధాని మోదీ పాలన నచ్చి ఈటల పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మంచి వేదిక అన్నారు. సీఎం కేసీఆర్ ను వ్యతిరేకించే వారికి బీజేపీ అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పారు.