Online fraud: దేశంలో ఆన్ లైన్ మోసాలకు కొదవలేదు. బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓ పెళ్లికాని వ్యక్తిని నమ్మించి ఏకంగా రూ. కోటి కొట్టేయడం మామూలు విషయం కాదు. నలభై ఏళ్లొచ్చినా ఇంకా పెళ్లి కాలేదనే బెంగతో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను లక్ష్యంగా చేసుకుని ఓపురుషుడే ఆడదానిగా నమ్మించి అతడి నుంచి డబ్బులు గుంజడం సంచలనం కలిగించింది.
ఓ బహుళ జాతి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే ఇంజినీర్ కు లక్షల్లో వేతనం. కానీ పెళ్లి కాలేదనే బెంగ మాత్రం పట్టుకుంది. దీంతో అతడు వివాహం కోసం తెగ ప్రయత్నాలు చేసినా ఇంతవరకు అతడి కోరిక నెరవేరలేదు. దీంతో అతడికి ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయం అయింది. విజయవాడలో ఉంటున్నానని చెప్పి చనువు పెంచుకుంది. తన పేరు కల్యాణిశ్రీగా చెప్పుకుంది.
Also Read: పెళ్లయిన తొలినాళ్లలో ఎలా ఉండాలంటే..?
అలా వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లికి రెడీ అయిన సమయంలో మనం కలుద్దామని అనుకోవడంతో విషయం బయటపడుతుందని గ్రహించి పెళ్లిళ్ల పేరయ్యను కలవాలని సూచించింది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏర్పడింది. పెళ్లిళ్ల పేరయ్య మధుసూదన్ అవతారం కూడా అతడే వేసి సాఫ్ట్ వేర్ దగ్గర సుమారు రూ. కోటి లాగేశాడు. దీంతో ఎప్పుడు కలుద్దామన్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు దాసును అరెస్టు చేశారు. ఆన్ లైన్ మోసాలకు అర్తం లేకుండా సామాజిక మాధ్యమాల్లో చూస్తూ మోసాలకు గురికావడం చూస్తున్నా ఎవరికి గుణపాఠం దక్కడం లేదు. కల్యాణిశ్రీగా, పెళ్లిళ్ల పేరయ్యగా నాటకాలు ఆడి సాఫ్ట్ వేర్ ను మోసం చేసింది ఒక్క మగాడనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. పెళ్లి గోలతో అనవసర విషయాల వైపు మళ్లి మోసాలకు గురికావద్దని పోలీసులు చెబుతున్నారు.
Also Read: కేకలు ఎందుకు వేస్తారు? అరుపులపై వెల్లడైన ఆసక్తికర విషయాలు