https://oktelugu.com/

Chiranjeevi: సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్​కు చిరు విజ్ఞప్తి

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్​లో సినిమా టికెట్ల ధరల తీసుకున్న చర్యలపై ఇటీవలె చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పలువురు నిర్మాతలు, దర్శకులు స్పందించారు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ మోహన్​ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ.. ట్వీట్​ చేశారు. Appeal to Hon’ble @AndhraPradeshCM Sri.@ysjagan pic.twitter.com/zqLzFX8hCh — Chiranjeevi Konidela (@KChiruTweets) November 25, 2021 సినీ పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం అన్​లైన్ ​టికెట్​ బిల్​ ప్రవేశపెట్టడం సరికాదని అన్నారు. థియేటర్ల మనుగడ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 / 02:34 PM IST
    Follow us on

    Chiranjeevi: ఆంధ్రప్రదేశ్​లో సినిమా టికెట్ల ధరల తీసుకున్న చర్యలపై ఇటీవలె చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పలువురు నిర్మాతలు, దర్శకులు స్పందించారు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ మోహన్​ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ.. ట్వీట్​ చేశారు.

    సినీ పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం అన్​లైన్ ​టికెట్​ బిల్​ ప్రవేశపెట్టడం సరికాదని అన్నారు. థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా బతుకున్న ఎంతో మంది కుటుంబాల కోసం, తగ్గించిన టికెట్​ ధరలను.. సముచితంగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే అదరికీ మేలు జరుగుతుందని చిరు తెలిపారు. దేశమంతా ఒకటే జీఎస్టీ ఉన్నప్పుడూ.. టికెట్ ధరల విషయంలో అదే వెసులుబాటు ఎందుకు ఉండకూడదని అన్నారు. దయచేసి ఈ విషయంపై పునరాలోచన చేయాలని జగన్​ను విన్నపించుకుంటూ ట్వీట్​ చేశారు.

    Also Read: స్టార్ హీరోలకు జగన్ ఓ గండంగా మారాడు !
    అటువంటి ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు సినీ పరిశ్రమ ఇంకా ముందుగు వెళ్తుందని అన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

    కాగా, ఆచార్య సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్నారు చిరు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్​చరణ్​ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, కాజల్​, పూజా హెగ్డె హీరోయిన్లుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రరిలో ఈ సినిమా విడుదల కానుంది.

    Also Read: లక్కీఛాన్స్ కొట్టేసిన జబర్దస్ట్ బ్యూటీ.. చిరు సినిమాలో రష్మి?