https://oktelugu.com/

Akhanda: సింపుల్​గా ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్​.. బాలయ్య బాబే కారణం?

Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. ఇటీవలే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సెన్సార్​ కూడా కంప్లీ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​ రిలీజ్​కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సెన్సార్​ బోర్డు యూఏ సర్టిఫికేట్​ను ఇచ్చింది. కాగా, ప్రస్తుతం మిగిలున్న పోస్ట్ ప్రొడక్షన్​ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతోంది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​, పాటలు నెట్టింట్లో వైరల్​గా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 / 02:43 PM IST
    Follow us on

    Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. ఇటీవలే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సెన్సార్​ కూడా కంప్లీ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​ రిలీజ్​కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సెన్సార్​ బోర్డు యూఏ సర్టిఫికేట్​ను ఇచ్చింది. కాగా, ప్రస్తుతం మిగిలున్న పోస్ట్ ప్రొడక్షన్​ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతోంది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​, పాటలు నెట్టింట్లో వైరల్​గా మారాయి.

    akhanda balakrishna

    Also Read: డిసెంబర్ లో వరుస సినిమాలతో పోటీకి సై అంటున్న టాలీవుడ్ హీరోలు…

    కాగా, ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​ను నవంబరు 27న హైదరాబాద్​లోని శిల్పకళావేదిలో నిర్వహించాలనుకున్నారు నిర్మాతలు. అయితే, ప్లాన్స్ అన్నీ రివర్స్ అయ్యాయట. తాజాగా, మీడియాతో ముచ్చటించిన సినిమా నిర్మాత రవీందర్ రెడ్డి.. ఈ విషంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్​ చాలా సింపుల్​గా జరగనుందని అన్నారు.

    మొదట గ్రాండ్​గానే నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. బాలయ్య చేతికి సర్జరీ కావడం వల్ల.. సింపూల్​గా ఈవెంట్​ను చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవలే బాలయ్య చేతికి చిన్నపాటి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ సినిమా ట్రైలర్​తో మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్స్​ భారీగా పెరిగిపోయాయి. ఈ విషంపై సంతోషం వ్యక్తం చేశారు రవీందర్​ రెడ్డి. ఆస్ట్రేలియాలో ఈ సినిమా ప్రీమియర్​ షోలు కొన్ని నిమిషాల్లోని అమ్ముడుపోయాయని వెల్లడించారు.

    Also Read: అఖండ ప్రీ రిలీజ్​ వేడుకలో మార్పులు.. వాతావరణ మార్పులే కారణమా?