సుప్రీం కోర్టులో బీజేపీ నేతలకు ఊరట

సుప్రీం కోర్టులో పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలకు ఊరట లభించింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న విజయవర్గీయ, పవన్ సింగ్, సౌరవ్ సింగ్, ముకుల్ రాయ్, కబీర్ శంకర్ బోస్ లపై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తుందని బీజేపీ నేతలు సుప్రీం కోర్టుకు తెలిపారు. తమపై నమోదైన కేసులపై దర్యాప్తును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కోరారు. అర్జున్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లో తాను […]

Written By: Suresh, Updated On : December 18, 2020 2:53 pm
Follow us on

సుప్రీం కోర్టులో పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలకు ఊరట లభించింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న విజయవర్గీయ, పవన్ సింగ్, సౌరవ్ సింగ్, ముకుల్ రాయ్, కబీర్ శంకర్ బోస్ లపై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తుందని బీజేపీ నేతలు సుప్రీం కోర్టుకు తెలిపారు. తమపై నమోదైన కేసులపై దర్యాప్తును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కోరారు. అర్జున్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లో తాను అధికార పార్ట టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తరువాత 2019లో తనపై 64 కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని ఆదేశించింది.