పిల్లలు లేకపోవడానికి కారణమదే.. నా ఆస్తులన్నీ వారికే: విజయశాంతి

టాలీవుడ్‌ లేడీ సూపర్‌‌ స్టార్‌‌గా పేరొందిన విజయశాంతి అంటే తెలియని ప్రేక్షకులు ఉండరేమో. ఒసేయ్‌ రాములమ్మ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్‌ రాములమ్మ మారిపోయారు. జనాల నుంచి మంచి గుర్తింపు అందుకున్న ఆమె.. ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకుంది. 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది. Also Read: టెన్త్ కుదింపు: తెలంగాణలో స్కూళ్లు […]

Written By: Srinivas, Updated On : December 19, 2020 12:17 pm
Follow us on


టాలీవుడ్‌ లేడీ సూపర్‌‌ స్టార్‌‌గా పేరొందిన విజయశాంతి అంటే తెలియని ప్రేక్షకులు ఉండరేమో. ఒసేయ్‌ రాములమ్మ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్‌ రాములమ్మ మారిపోయారు. జనాల నుంచి మంచి గుర్తింపు అందుకున్న ఆమె.. ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకుంది. 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది.

Also Read: టెన్త్ కుదింపు: తెలంగాణలో స్కూళ్లు తెరిచేది అప్పుడే..

వందలాది సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా నటించిన ఆమె తెలంగాణ సాధనలోనూ ఎంతగానో కష్టపడ్డారు. ఇక ఆమె చాలా రోజుల తరువాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో మళ్లీ ఆమె బిజీ అయ్యే అవకాశం ఉండవచ్చని టాక్ వచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్‌ కూడా వచ్చాయి. పెద్ద పెద్డ సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ కోసం అగ్ర దర్శకులు సంప్రదించినా ఆమె ఒప్పుకోలేదు.

తన జీవితం ప్రజా సేవకే అంకితం అంటూ.. ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం లేదని క్లియర్‌‌గా వివరణ ఇచ్చారు. మెగాస్టార్ సినిమాలో మళ్లీ చేయబోతున్నారనే రూమర్స్ లో కూడా నిజం లేదని కొట్టిపారేశారు. ఇక విజయశాంతి పెళ్లి చేసుకున్న తరువాత సినిమాల్లో కొన్నాళ్లపాటు కొనసాగారు. చివరగా 2006లో నాయుడమ్మ సినిమా తరువాత మళ్లీ 14ఏళ్ల గ్యాప్‌ ఇచ్చారు. ఆ తరువాత వెండితెరపై కనిపించారు. ఇక ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నట్టు చెప్పిన ఆమె భవిష్యత్తులో మరింత బిజీగా ప్రజా సేవలోనే ఉండనున్నట్లు తెలిపారు.

Also Read: టీపీసీసీ ఎంపికపై తడబడుతున్న అధిష్టానం..! కారణమెంటీ?

పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ..‘ పిల్లలు వద్దనుకున్నాక రాజకోయల్లోకి రావడం జరిగింది. మనం అనే పదం కన్నా కూడా నాది అనే స్వార్థం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఉంటే వారి కోసం ఏదో ఒకటి చేయాలని స్వార్థం ఉంటుంది. నన్ను ఈ స్థాయికి చేర్చింది ప్రజలు కాబట్టి. వాళ్లకు సేవ చేసే క్రమంలో స్వార్థం అనేది ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా’ అని విజయశాంతి చెప్పారు. ఇక ఆస్తుల గురించి మాట్లాడుతూ.. ‘నేను నా తుది శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడుతా. ఐదేళ్లకోసారి పదవుల కోసం పోరాడే మనిషిని కాదు. ఇక నేను చనిపోయేలోపు నా ఆస్థులన్నీ కూడా ప్రజలకే చెందాలి. చదువుకోలేని ఎంతో మంది పేదవారికి ఉపయోగపడేలా ఒక ట్రస్టు ద్వారా వారికి నా ఆస్తులు చెందాలని నిర్ణయం తీసుకున్నా. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని విజయశాంతి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్