ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బలు తింటున్న జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఏకంగా హైకోర్టు జడ్జి అలా ఎందుకు తీర్పునిచ్చారో అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో జగన్ సర్కార్ వాదనకు కొండంత బలాన్ని ఇచ్చినట్టైంది.
Also Read: పవన్‌కు ఆహ్వానం లేదా..? కావాలనే అటెండ్ కాలేదా..?
ఏపీ పోలీసుల తీరుపై గతంలో ఏపీ హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. పోలీసుల చట్ట ఉల్లంఘనలపై హెబియస్ కార్పస్ పిటీషన్లు వేశారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన వారిని పోలీసులు ఇబ్బందులు పెట్టారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబర్ 1న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ పిటీషన్ పై హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీలో రాజ్యంగ సంక్షోభం అంశంలో విచారణలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు నిలిపివేసింది.
Also Read: తిరుపతి ఉప ఎన్నికకు ముందే కర్నూలుకు హైకోర్టు?
ఆంధ్రప్రదేశ్ లో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా? లేదా అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు ఆదేశాలు.. విచారణలపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకంగా ఉన్నాయని.. జడ్జి అలా ఎందుకు అన్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. వ్యవస్థ ఏమీ కుప్పకూలలేదు కదా అని అన్నారు. హైకోర్టు వ్యాఖ్యలు కలవరపరిచేలా ఉన్నాయని వివరించారు. తదుపరి విచారణ శీతాకాల సెలవుల తరువాతకు వాయిదా వేసింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్