హిందుత్వవాదానికి కట్టుబడి ఉన్నాం: సీఎం ఉద్దవ్ ఠాక్రే

ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే బీజేపీపై కౌంటర్ ఇచ్చారు. తాము హిందుత్వాన్ని వదులుకోలేదని, హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. గత కొన్ని రోజులగా రైట్ వింగ్ లీడర్ అయిన ఉద్దవ్ ఇప్పుడు సెక్యులర్ వాదిగా మారిపోయారని బీజేపీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. దీంతో ఉద్దవ్ వారి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. మేము హిందుత్వవాదంతోనే ఉన్నామని, పురాతన ఆలయాలను పునరుద్ధరించడానికి టెంపుల్ ఫండ్ ను కేటాయిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలని అన్నారు. కొన్నిరోజుల కిందట గవర్నర్ కోషియారీ, […]

Written By: Suresh, Updated On : December 16, 2020 3:14 pm
Follow us on

ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే బీజేపీపై కౌంటర్ ఇచ్చారు. తాము హిందుత్వాన్ని వదులుకోలేదని, హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. గత కొన్ని రోజులగా రైట్ వింగ్ లీడర్ అయిన ఉద్దవ్ ఇప్పుడు సెక్యులర్ వాదిగా మారిపోయారని బీజేపీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. దీంతో ఉద్దవ్ వారి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. మేము హిందుత్వవాదంతోనే ఉన్నామని, పురాతన ఆలయాలను పునరుద్ధరించడానికి టెంపుల్ ఫండ్ ను కేటాయిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలని అన్నారు. కొన్నిరోజుల కిందట గవర్నర్ కోషియారీ, సీఎం ఉద్దవ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల తరువాత దేవాలయాలను తెరిచే విషయంపై గవర్నర్ మాట్లాడుతూ ఉద్దవ్ సెక్యులర్గా మారిపోయాడా..? అని వ్యాఖ్యానించడంతో ఉద్దవ్ ఈ విధంగా స్పందించారు.