https://oktelugu.com/

కేసీఆర్ ‘ఎల్ఆర్ఎస్’పై సుప్రీంకోర్టుకు..

ఎల్.ఆర్.ఎస్.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకం ప్రజల్లో తీవ్ర విమర్శల పాలైంది. చాలా మంది తమ భూములపై డబ్బులు కట్టి క్రమబద్దీకరించుకున్నారు. ఈ దెబ్బకు కేసీఆర్ దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అంతటి ప్రజాగ్రహ పథకంపై తాజాగా సుప్రీంకోర్టుకు ఎక్కాడు ఓ జనగాం వాసి. తెలంగాణలోని భూముల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) పై కొందరు సుప్రీంకోర్టుకు ఎక్కారు. తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో సరైన ప్రణాళిక లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నారని […]

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2020 / 03:07 PM IST
    Follow us on

    ఎల్.ఆర్.ఎస్.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకం ప్రజల్లో తీవ్ర విమర్శల పాలైంది. చాలా మంది తమ భూములపై డబ్బులు కట్టి క్రమబద్దీకరించుకున్నారు. ఈ దెబ్బకు కేసీఆర్ దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అంతటి ప్రజాగ్రహ పథకంపై తాజాగా సుప్రీంకోర్టుకు ఎక్కాడు ఓ జనగాం వాసి.

    తెలంగాణలోని భూముల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) పై కొందరు సుప్రీంకోర్టుకు ఎక్కారు. తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో సరైన ప్రణాళిక లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టులో జనగాంకు చెందిన జువ్వాడి సాగర్ రావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు.

    ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఎల్.ఆర్.ఎస్ ద్వారా అక్రమాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వారిని అధికారులను వదిలేసి ప్లాట్లు కొన్నవారు ఇళ్లు కట్టుకున్న వారిని కేసులు నమోదు చేస్తున్నారని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే అక్రమ లేఅవుట్ వల్ల వరదలతో సహా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అక్రమ లే అవుట్లకు అనుమతి ఇచ్చిన వారిపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.

    కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్.ఆర్ఎస్ కు ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులను ప్రజలు చేసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ గడువు విధించగా.. 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. గ్రేటర్ తోపాటు శివారు మున్సిపాలిటీలు , కార్పొరేషన్ల నుంచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు.