spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Annadata Sukhi Bhava: అన్నదాత సుఖీభవ.. జమ కాకుంటే ఇలా చేయండి!

Annadata Sukhi Bhava: అన్నదాత సుఖీభవ.. జమ కాకుంటే ఇలా చేయండి!

Annadata Sukhi Bhava: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) నిధులను జమ చేసింది. కేంద్రం అందించే పీఎం కిసాన్ రూ.2000, రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు జత కలిపి నిన్ననే రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే కొంతమంది రైతులకు వివిధ కారణాలతో జమకాలేదు. అటువంటి వారి తమకు ఎందుకు నిధులు జమ కాలేదు తెలుసుకోవడంతో పాటు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. సీఎం చంద్రబాబు నిన్ననే అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. దీంతో ఈ ఏడాదికి సంబంధించి చివరి విడత సాయం కూడా అందించినట్లు అయింది.

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

* స్టేటస్ చెక్ కోసం..
అయితే అర్హత ఉండి అన్నదాత సుఖీభవ నిధులు జమ కాకుంటే మాత్రం ఎలా చెక్ చేసుకోవాలో అధికారులు సూచిస్తున్నారు. మూడో విడత కింద ప్రభుత్వం ఆరు పాయింట్ 85 లక్షల మంది రైతులకు 6000 చొప్పున విడుదల అయింది. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ పేరుతో ఒక వెబ్ సైట్( websites ) ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ లోకి వెళ్లి స్టేటస్ ను సులువుగా చెక్ చేసుకోవచ్చు. అలాగే అన్నదాత సుఖీభవ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. యాప్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రైతులు ముందుగా http://annadatha sukhibhava.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్ళాలి. హోం పేజీలో know your status అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఈ కేవైసీ యాక్టివ్ లో ఉందా? లేదా అనే వివరాలు కూడా తెలుస్తాయి.

* ఫిర్యాదుకు అవకాశం..
అర్హత ఉండి అన్నదాత సుఖీభవ నిధులు జమ కాని రైతులు నేరుగా గ్రామ సచివాలయ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. రైతు సేవా కేంద్రంలో సంప్రదించవచ్చు. మరోవైపు ఈ సమస్య పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచారు. 155251 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అర్హత ఉండి అందకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ నిధులు జమ కావడంతో రైతులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. అయితే 2018 తర్వాత భూహక్కులు పొందిన యజమానులకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ వర్తించడం లేదు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version