నిరసన స్థలం నుంచి తిరిగి వెళ్తున్న ఇద్దరు రైతుల మృతి

ఆ రైతులు కేంద్ర వ్యవసాయయ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో పాల్గొన్నారు. తిరిగి పంజాబ్ వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. హర్యాణా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి చెందారు. పంజాబ్ కు చెందిన వారు ఢిల్లీ సరిహద్దులోని నిరసన స్థలం నుంచి పాటియాలకు తిరిగి వెళ్తున్నారు. మార్గమధ్యంలోని కర్నాల్ జిల్లాలోని తారారీ ఫ్లైఓవర్ పై రైతుల ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాటియాలకు చెందిన […]

Written By: Suresh, Updated On : December 15, 2020 2:42 pm
Follow us on

ఆ రైతులు కేంద్ర వ్యవసాయయ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో పాల్గొన్నారు. తిరిగి పంజాబ్ వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. హర్యాణా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి చెందారు. పంజాబ్ కు చెందిన వారు ఢిల్లీ సరిహద్దులోని నిరసన స్థలం నుంచి పాటియాలకు తిరిగి వెళ్తున్నారు. మార్గమధ్యంలోని కర్నాల్ జిల్లాలోని తారారీ ఫ్లైఓవర్ పై రైతుల ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాటియాలకు చెందిన ఇద్దరు రైతులు మరణించారు. ట్రక్కులోని మరి కొంత మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న తారారి పోలిస్ స్టేషన్ ఎస్ఐ సచిన్ పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.