https://oktelugu.com/

అవి రావనుకునే పెళ్లికి సిద్ధ‌పడ్డాను – సమంత

ఎంత పెద్ద హీరోయిన్ అయినా.. ఆమెకు పదేళ్ల కెరీర్ ఉండటమే గొప్ప అదృష్టంగా భావించాల్సిన పరిస్థితి ప్రస్తుత కాలం. ఇలాంటి కాలంలో పెళ్లి తరువాత, హీరోయిన్ల‌కు అవ‌కాశాలు రావడం అనేది నిజంగా కష్టమే. కానీ, పెళ్లి త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్ గా అద్భుతంగా రాణిస్తున్న హీరోయిన్.. ఈ జనరేషన్ లో ఎవరైనా ఉన్నారా అంటే.. అది కచ్చితంగా ‘స‌మంత’నే. అయితే స‌మంత ప్రస్తుతం ఓ టాక్‌ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ టాక్ […]

Written By:
  • admin
  • , Updated On : December 15, 2020 / 02:50 PM IST
    Follow us on


    ఎంత పెద్ద హీరోయిన్ అయినా.. ఆమెకు పదేళ్ల కెరీర్ ఉండటమే గొప్ప అదృష్టంగా భావించాల్సిన పరిస్థితి ప్రస్తుత కాలం. ఇలాంటి కాలంలో పెళ్లి తరువాత, హీరోయిన్ల‌కు అవ‌కాశాలు రావడం అనేది నిజంగా కష్టమే. కానీ, పెళ్లి త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్ గా అద్భుతంగా రాణిస్తున్న హీరోయిన్.. ఈ జనరేషన్ లో ఎవరైనా ఉన్నారా అంటే.. అది కచ్చితంగా ‘స‌మంత’నే. అయితే స‌మంత ప్రస్తుతం ఓ టాక్‌ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ టాక్ షోతో ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకోవడానికి ఎవ్వరికీ తెలియని విషయాలను కూడా సమంత రాబడుతూ.. అలాగే తనకు సంబంధించిన విషయాలను కూడా బయట పెడుతూ, మొత్తానికి బాగానే అందర్నీ ఆకట్టుకుంటుంది.

    Also Read: త్రివిక్రమ్‍ తో మహేష్ కి ఇక కష్టమే.. కారణం అదేనా ?

    అయితే తాజాగా తానూ చేస్తున్న టాక్‌ షోలో తన పెళ్లి త‌ర్వాత తనకొచ్చిన అవ‌కాశాల‌ పై సమంత ఆస‌క్తిక‌రమైన కామెంట్స్ ను చేసింది. పెళ్లి త‌ర్వాత కూడా మంచి పాత్ర‌ల్లో న‌టిస్తున్నానంటే అదంతా త‌న అదృష్టమ‌ని చెప్పుకొచ్చింది. పెళ్లి అనేది హీరోయిన్ల కెరీర్‌ కు పెద్ద అడ్డంకి అనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం అని, అయితే అది అబద్దం అని నిరూపించాల‌నో, లేక అలాంటి అపోహ‌ను తొల‌గించాల‌నో నేను పెళ్లి తరువాత నా కెరీర్‌ను ప్రారంభించ‌లేదు. ఒక విధంగా పెళ్లి త‌ర్వాత నాకు ఇక ఎలాంటి అవ‌కాశాలు రావు అని అనుకున్నాను.

    Also Read: స్టార్ డమ్ కోసం ఎక్స్ పోజింగ్ ఏమిటి.. ఏమైనా చేస్తాను !

    నిజంగా నేను అప్పుడు సినిమా అవ‌కాశాలు రావ‌నుకునే పెళ్లికి సిద్ధ‌పడ్డాను. కాకపోతే, అదృష్టం త‌న వైపు ఉంద‌ని.. పెళ్లి తర్వాత కూడా ‘రంగస్థలం’, ‘మహానటి’ లాంటి గొప్ప సినిమాల్లో న‌టించే అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని సమంత ఆనందంగా చెప్పుకొచ్చింది. అలాగే ‘ఓ బేబీ’తో కూడా సమంత మెప్పించింది. కేవ‌లం ఇదంతా త‌న‌కు అదృష్టం వ‌ల్ల ద‌క్కిన అవ‌కాశాలుగానే తానూ భావిస్తానని స‌మంత తెలిపింది. ఇక సుదీర్ఘ ప్రేమ ప్ర‌యాణం అనంత‌రం అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబ‌ర్ 6వ తేదీతో మూడేళ్ల వివాహ బంధాన్ని పూర్తి చేసుకున్నారు. టాలీవుడ్‌లో బెస్ట్ క‌పుల్‌గా చైత‌న్య‌-స‌మంత జంట ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్