బీహార్ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ఆధ్వర్యంలో నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నాలుగోసారిగా సీఎంగా గద్దెనెక్కిన నితీశ్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు తరువాత మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఇంకా తగ్గనందున కోవిడ్ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలకు కరోనా టెస్ట్ లు చేయనున్నారు. అలాగే అసెంబ్లీ హాల్ లో కూడా భౌతిక దూరంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. కాగా ప్రొటెం స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జీతన్ రామ్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈరోజు ప్రమాణం చేయించనున్నారు. ఆ తరువాత స్పీకర్ గా జీతన్ రామ్ ను ఎన్నుకుంటారు.