
తమిళనాడు రాష్ట్రంలో తెలుగు జర్నలిస్టు దారుణహత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం గ్రామానికి చెందిన నాగరాజు తమిళనాడులోని హనుమంత నగర్లో నివిస్తున్నారు. ఉదయం మార్నింగ్ వాగ్ కు వెళుతుండగా తన ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వేట కొడువళ్లతో దాడి చేశారు. దీంతో నాగరాజు తప్పించుకునేందుకు యత్నించగా వెంబడించి మరీ హత్య చేశారు. అయితే తమిళనాడులోని ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న నాగరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై వరుసగా కథనాలు రాశారు. అంతే కాకుండా ఆయన హిందూ మహాసభ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగానూ ఉన్నారు. కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యపై పలు కోణాల్లో విచారిస్తున్నారు. గతంలో అక్రమ భూములపై కథనాలు రాసిన ఓ జర్నలిస్టులు కొందరు ఇలాగే హత్య చేశారు. మరోవైపు నాగరాజు హత్య నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బ్రుందాన్ని ఏర్పాటు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు.