Ustaad Bhagat Singh copied scenes: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసే సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తుంటారు… ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి మన స్టార్ హీరోలైతే ఎదిగారు.
ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. గత సంవత్సరం మెప్పించిన ఆయన ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో ఇతర హీరోల పాటలకు పవన్ కళ్యాణ్ డ్యాన్స్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా ?
యూఎస్ఏ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే ఇప్పటికే పడిపోయాయి. కాబట్టి ఈ సినిమాలో సినిమాలోని కొన్ని సన్నివేశాలను గబ్బర్ సింగ్ సినిమా నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తుంది… రౌడీలతో ఫైటింగ్ చేసే సన్నివేశాలు వాళ్లతో కామెడీ చేసే ఎపిసోడ్స్ మొత్తం గబ్బర్ సింగ్ సినిమాలో చూసినట్టుగానే అనిపిస్తున్నాయంటూ యూఎస్ఏ లో సినిమా చూసిన కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమాని కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన హరీష్ శంకర్ ఈ సినిమాను గబ్బర్ సింగ్ లాగే కమర్షియల్ గా తీర్చి దిద్దినట్టుగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫుల్ స్వాగ్ ను వాడుకొని ఈ సినిమాతో మ్యాజిక్ చేశారట. ఇక ఏది ఏమైనా కూడా ఒకటి రెండు ఎపిసోడ్లను మినహాయిస్తే సినిమా అంతా బాగుందని పాజిటివ్ టాక్ అయితే వచ్చిందనే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… రేపు రిలీజ్ అవ్వ బోతున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది. ప్రేక్షకులు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…
