https://oktelugu.com/

తెలంగాణలో రెగ్యూలర్ తరగతులు.. ఎప్పటి నుంచో తెలుసా?

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలగా అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. కేంద్రం లాక్డౌన్.. అన్ లాక్ చేపడుతూ కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ సాధారణ పరిస్థితులను తీసుకొస్తుంది ఈక్రమంలోనే పాఠశాలలు.. కళాశాలలకు అనుమతి ఇవ్వడంతో కొన్ని రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. Also Read: రేపే డిసెంబర్‌‌ 7.. వరద సాయం మొదలవుతుందా? తెలుగులో రాష్ట్రాల్లో మాత్రం కొద్దిరోజులుగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఏపీలోనూ రెగ్యూలర్ తరగతులను ప్రారంభించారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 6, 2020 / 01:05 PM IST
    Follow us on

    దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలగా అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. కేంద్రం లాక్డౌన్.. అన్ లాక్ చేపడుతూ కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ సాధారణ పరిస్థితులను తీసుకొస్తుంది ఈక్రమంలోనే పాఠశాలలు.. కళాశాలలకు అనుమతి ఇవ్వడంతో కొన్ని రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి.

    Also Read: రేపే డిసెంబర్‌‌ 7.. వరద సాయం మొదలవుతుందా?

    తెలుగులో రాష్ట్రాల్లో మాత్రం కొద్దిరోజులుగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఏపీలోనూ రెగ్యూలర్ తరగతులను ప్రారంభించారు. ఈనేపథ్యంలో తెలంగాణలోనూ రెగ్యూలర్ తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. దీనిపై విద్యాశాఖ సుదీర్ఘంగా కసరత్తులు చేస్తోంది.

    ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రెగ్యూలర్ తరగతులు ప్రారంభించేందుకు విద్యాశాఖ సమయాత్తం అవుతోంది. మరో రెండు మూడు వారాల్లో రెగ్యూలర్ తరగతుల ప్రారంభంపై విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం ప్రకటించనుంది. కరోనా నిబంధనల్లో భాగంగా విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా.. శానిటైజర్లతో గదులను శుభ్రం చేసేలా ఉత్తర్వులు జారీ చేయనుంది.

    Also Read: సీన్ రివర్స్‌.. సెటిలర్ల మద్దతు గులాబీకే..!

    ఒక్కో తరగతిలో 20మంది మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోనుంది. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే విద్యార్థుల్లో ఇమ్యూనిటీ పెంచేందుకు మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీంతో దాదాపు ఎనిమిది నెలల తర్వాత తరగతి గదులు ప్రారంభం కానున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్