మనీల్యాండరింగ్ కేసులో శివసేన ఎమ్మ్ ల్యే ప్రతాప్ సర్నాయక్ ఇళ్లపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. అయితే ఈడీ మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. థానేలోని ఓవల -మజివాడ నియోజకవర్గ ఎమ్మల్యే అయిన ప్రతాప్ ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రానౌత్ వ్యవహారంలో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. కంగానా రానౌత్ పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక ‘సంజయ్ రౌత్ సాదాసీదాగానే కంగనను హెచ్చరించారు. ఆమె ఇక్కడకు వస్తే మా సాహస మహిళలు నిద్రపోనీయరు. ముంబైని పీవోకెతో పోల్చిన కంగనపై దేశద్రోహం కేసు పెట్టాలి’అని ప్రతాప్ ట్వీట్ చేశారు. దీంతో ఎన్ సీ డబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మ ఎమ్మెల్యేపై మండిపడ్డారు.