https://oktelugu.com/

హైదరాబాదీలకు ఉచితంగా ‘నమస్తే’ పెట్టిన టీఆర్ఎస్

ఎవరైనా ఎన్నికల వేళ ఏం చేస్తారు. డబ్బులు పంచుతారు.. మందు పోయిస్తాడు.. వస్తువులను కానుకగా ఇస్తారు. ఓట్లు వేయడానికి అప్పటికప్పుడు ఓటర్లు కోరే కోరికలన్నీ తీరుస్తారు. మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తారు.. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ గులాబీ దండు ఆశ్చర్యపరిచింది. ఎవ్వరూ కోరని దాన్ని ఉచితంగా పంచింది. అక్షరాస్యులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో వారికి తమ పత్రికలను ఉచితంగా పంచేసింది. అందులో సర్వం టీఆర్ఎస్ మయం చేసి తమ పథకాలకు ఉచిత ప్రచారం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2020 / 12:34 PM IST
    Follow us on

    ఎవరైనా ఎన్నికల వేళ ఏం చేస్తారు. డబ్బులు పంచుతారు.. మందు పోయిస్తాడు.. వస్తువులను కానుకగా ఇస్తారు. ఓట్లు వేయడానికి అప్పటికప్పుడు ఓటర్లు కోరే కోరికలన్నీ తీరుస్తారు. మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తారు.. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ గులాబీ దండు ఆశ్చర్యపరిచింది. ఎవ్వరూ కోరని దాన్ని ఉచితంగా పంచింది. అక్షరాస్యులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో వారికి తమ పత్రికలను ఉచితంగా పంచేసింది. అందులో సర్వం టీఆర్ఎస్ మయం చేసి తమ పథకాలకు ఉచిత ప్రచారం కల్పిస్తోంది. పేపర్ ఫ్రీగా ఇచ్చారని తీసుకుంటే అందులో మొత్తం గులాబీ మయం.. టీఆర్ఎస్ ప్రచార వార్తలే ఉండడంతో జీహెచ్ఎంసీ వాసులు అవాక్కవుతున్నారు.

    Also Read: కేసీఆర్ వరాలు సరే.. అమలుపైనే అనుమానం

    జీహెచ్ఎంసీ ఎన్నికలను గులాబీ దండు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి కేటీఆర్ ప్రచారంలో లీడ్ తీసుకున్నారు. కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. మంత్రులంతా రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ మేనిఫెస్టోను, పథకాలను, ప్రయోజనాలను జనాలకు చేరువ చేయడానికి టీఆర్ఎస్ మాంచి ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సారథ్యంలో కొనసాగుతున్న ‘నమస్తే తెలంగాణ’.. ‘తెలంగాణ టుడే ఇంగ్లీష్ పత్రిక’ను హైదరాబాదీలకు ఇంటింటా ఉచితంగా పంచాలని డిసైడ్ అయ్యింది. దీనివెనుక ఓ లాజిక్ ఉంది.

    ఎన్నికల వేళ ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడం కష్టం. దాదాపు కోటి మంది ఉన్న హైదరాబాదీలకు టీఆర్ఎస్ ప్రచారం చేరాలంటే ఏం చేయాలని ఆలోచించిన మంత్రి కేటీఆర్ అండ్ బ్యాచ్ తమ సారథ్యంలో నడుస్తున్న టీఆర్ఎస్ పత్రికలను భారీగా ముద్రించి ఇంటింటికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆ పత్రికలు మరి నీట్ గా నిక్కచ్చిగా ఉన్నాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే..

    Also Read: మళ్లీ కేసీఆర్ జాతీయ రాజకీయాలు.. వర్కవుట్ అవుతాయా?

    ఉచితంగా ఇస్తున్నారని పత్రికలను ఓపెన్ చేస్తే అంతా కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ నామస్మరణతో పత్రిక నిండిపోతోందట.. కేసీఆర్ వీరుడు శూరుడు ధీరుడు.. ఈయన లేకుంటే తెలంగాణ లేదు.. హైదరాబాద్ లేదంటూ ఊదరగొట్టేస్తున్నారట.. ఫ్రీగా వస్తుందని ఫినాయిల్ అయినా తాగే జనాలకు ఇప్పుడు గులాబీ పత్రికలు చికాకు పుట్టిస్తున్నాయట.. తమ ప్రచారం ఉచితం అవుతోందని సంబరపడ్డ గులాబీ దండు ఈ ప్లాన్ చేయగా.. ప్రజలకు మాత్రం ఈ కేసీఆర్ నామస్మరణ వెగటు పుట్టిస్తోందట..

    మరి గులాబీ పత్రికలు ప్రజలపై ఏమాత్రం ప్రభావం చూపిస్తాయి? ఓట్ల వాన కురిపిస్తాయా? వీళ్ల కష్టం ఫలిస్తుందా అనేది ఫలితాల నాడే తెలియనుంది. అప్పటివరకు ప్రజలంతా ఈ పత్రికల ప్రచారాన్ని ఉగ్గబట్టుకొని భరించాల్సిందే మరి..

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్