
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తరుపున ప్రచారం చేయడానికి ఆ పార్టీ జాతీయ యువ మోర్చా అధ్చక్షుడు హైదరాబాద్ లో పర్యటిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ లోపలకి వెళ్లేందుకు అక్కడికి వచ్చారు. అయితే గేటు వద్ద తేజస్వి సూర్యను పోలీసులు అడ్డుకున్నారు. కళాశాలకు అనుమతి లేదని చెప్పారు. అయితే కాసేపు పోలీసులకు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి భారీ భద్రత మధ్య పోలీసులు అనుమతించారు. ఇక వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని తేల్చడంతో గేటు బయటే వాహనాలను ఉంచి అక్కడి నుంచి తేజస్వీ, పార్టీ నాయకులు నడుచుకుంటూ వెళ్లారు.