
భారతదేశ అభివృద్ధిలో టాటా గ్రూప్ కీలకపాత్ర వహించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. శనివారం జరిగిన అసోచామ్ ఫౌండేషన్ వీక్ 2020 కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. గత వందేళ్లలో ఇండస్ట్రీ ఛాంబర్ భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంతో సహా భారత అభివృద్ధికి సాక్షిగా నిలిచిందన్నారు. దేశపురోగతిలో భాగంగా వాణిజ్య సహకారాన్ని అందించినందుకుగాను ‘అసోచామ్ ఎంటర్‌ప్రైజ్ ఆఫ్ ద సెంచరీ’ అవార్డును టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ రతన్‌టాటాకు అందించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారతదేశ అభివృద్ధిలో టాటా గ్రూప్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు.