
బీజేపీ నేత బండి సంజయ్ సమక్షంలో టీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో చేరారు. కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ పొర్లుదండాలు పెట్టినా సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో తనిఖీలు చేస్తే నిధులు బయటపడతాయన్నారు. నిధుల్ని కాపాడుకోవడానికే కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉంటున్నారని, ఫామ్‌హౌస్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి సోదాలు చేయాలని కోరారు.