Homeజాతీయం - అంతర్జాతీయంPolices Turned To Thives: దొంగలుగా మారిన పోలీసులు... చివరికలా దొరికారు

Polices Turned To Thives: దొంగలుగా మారిన పోలీసులు… చివరికలా దొరికారు

Polices Turned To Thives: రక్షకభటులు కాదు.. భక్షకభటులని పోలీసులపై ఉన్న అపవాదును నిజం చేశారు మహారాష్ట్రలోని థానే నగరంలోని ముంబ్రా పోలీస్ స్టేషన్ సిబ్బంది. తమకున్న విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసి ఓ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లో లభించిన రూ.30 కోట్ల నగదుకు లెక్కలు అడిగారు. అది అంత తన కష్టార్జితమని సదరు వ్యక్తి చెప్పుకున్నా వినలేదు. అందులో సగం నగదు ఇస్తే వదిలేస్తామని చెప్పారు. సదరు వ్యక్తి వినకపోవడంతో నగదును పోలీస్ స్టేషన్ కు తరలించారు. అన్యాయమన్న సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్లోనే దాడిచేశారు. చివరకు రూ.6 కోట్లు తీసుకొని మిగతా రూ.24 కోట్లతో సదరు వ్యక్తిని ఇంటికి పంపించేశారు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర హోంమంత్రివరకూ ఫిర్యాదులు పంపించడంతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. సమగ్ర విచారణ చేపట్డంలో భాగంగా పోలీస్ స్టేషన్ లో సీసీ పూటేజీలు పరిశీలించడంతో ఠాణా కీలక అధికారులతో పాటు పది మంది సిబ్బంది పాత్ర బయటపడింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. ఏప్రిల్ 12న వేకువజామున జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Polices Turned To Thives
Polices Turned To Thives

ఏం జరిగిందంటే..

ఆ రోజు అనధికారికంగా నగదు ఉందని సమాచారమందుకున్న ఠాణా అధికారి గీతారామ్ షెవాలే, సబ్ ఇన్ స్పెక్టర్ రవి మద్నే, పిఎస్‌ఐ హర్షల్ కాలేలతో పాటు దిగువస్థాయి సిబ్బంది ఏడుగురు మెమన్ అనే వ్యక్తి నివాసానికి వెళ్లారు. ఇళ్లంతా తనిఖీ చేయగా 30 పెట్టెల్లో రూ.కోటి చొప్పున రూ.30 కోట్లు లభించాయి. ఈ నగదు ఎవరిదని పోలీసులు మెమన్ ను ప్రశ్నించగా.. ఇదంతా నా కష్టార్జితంగా చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి పత్రాలు చూపుతానని.. అవకాశం ఇవ్వాలని కాళ్లేవేళ్లా పడ్డాడు. కానీ పోలీసులు కనికరించలేదు. ఆ 30 పెట్టెలను ముంబ్రా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఠాణా అధికారి గీతారామ్ షెవాలే కేబిన్ లోకి చేర్చారు. మెమన్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. భౌతికంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా నగదులో సగం ఇస్తే నిన్ను విడిచిపెడతామంటూ భేరం పెట్టుకున్నారు. కానీ దానికి మెమన్ ఒప్పుకోలేదు. కష్టపడి సంపాదించిన నగదును మీకెందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించాడు. దీంతో ఆయనపై పోలీసులు దాడి చేశారు. చివరకు విసిగి వేశారిపోయిన మెమన్ రూ.2 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. పోలీసులు మాత్రం రూ.6 కోట్లు తీసుకొని.. మిగతా రూ.24 కోట్లతో మెమన్ ను విడిచిపెట్టేశారు. అయితే పోలీసులు అంతటితో కథ ముగిసిపోయిందనుకున్నారు. పోలీస్ స్టేషన్ లో సీసీ పూటేజీలు ఉంటాయని.. అందులో ద్రుశ్యాలు రికార్డు అయి ఉంటాయన్న విషయాన్నే మరిచిపోయారు.

Also Read: KA Paul Meets Amit Shah: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ ఆంతర్యమేమిటో?

అడ్డంగా బుక్కయ్యారు..

సీన్ కట్ చేస్తే.. అక్కడి కొద్దిరోజులకే మెమన్ తన ఇంట్లో పోలీసులు చోరీ పాల్పడినట్టు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి రాష్ట్ర హోం మంత్రి వరకూ లేఖల రూపంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ కమిషనర్ జైజిత్ సింగ్ నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. పోలీసులే చోరీ చేసినట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. విచారణలో భాగంగా బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. పోలీస్ స్టేషన్ లో సీసీ పుటేజీలు పరిశీలించారు. మొత్తం ఎపిసోడ్ అంతా అందులో కనిపించింది. మరోవైపు మెమన్ తన నగదుకు సరైన పత్రాలు సైతం చూపించారు. దీంతో రాణా అధికారి, ఎస్ ఐలతో పాటు పది మంది సిబ్బందిపై బుధవారం సస్పెన్షన్ వేటు పడింది.

Also Read: RRR OTT Trailer : మైండో బ్లోయింగ్ విజువల్స్.. ఓన్లీ ఫర్ ఓటీటీ.. ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version